
గౌతు లచ్చన్న ఆదర్శనీయులు
భీమవరం(ప్రకాశంచౌక్): స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న ఆదర్శనీయులని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లచ్చన్న జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్, జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌతు లచ్చన్న మార్గం అనుసరణీయమ న్నారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె.వెంకటేశ్వరరావు, హాస్టళ్ల అధికారులు సీహెచ్ మోహనరావు, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.