
మువ్వన్నెల రెపరెపలు
న్యూస్‌రీల్
నిండా ముంచిన గోస్తనీ
భారీ వర్షాలకు పెనుమంట్ర మండలంలో గోస్తనీ న ది, గొంతేరు, భగ్గేశ్వరం మురుగు కాలువలు పొంగి పొర్లడంతో వందలాది ఎకరాలు నీటమునిగాయి. 8లో u
● అంబరాన్నంటిన సంబరాలు
● పంద్రాగస్టు వేడుకల్లో చిన్నారులు
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
భీమవరం: భీమవరం కలెక్టరేట్ వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ సీహెచ్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలో పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.
అవార్డుల ప్రదానం
జిల్లాలో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారి కుటుంబాలను సత్కరించారు. ప్రజాసేవలో నిమగ్నమైన స్వచ్ఛంద సంస్థలు, దాతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. పలు రంగాల్లో ప్రతిభ కనబర్చిన సేవకులు, అధికారులు, సిబ్బందికి అవార్డులు, ప్రశంసా పత్రాలు, సర్టిఫికెట్లను అందజేశారు. ఉత్తమ ప్రతిభను చూపిన పోలీసుల కు పతకాలను బహూకరించారు.
స్టాల్స్ సందర్శన : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ శాఖ, మత్స్యశాఖ, విద్యాశాఖ–సమగ్ర శిక్ష, సహిత విద్యా–సమగ్రశిక్ష, వ్యవసాయశాఖ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ఉద్యాన శాఖ, రాష్ట్ర సూక్ష్మ సేద్య పథకం, ఎస్‌ఈఆర్‌పీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పరిశ్రమల కేంద్రం, యూనియన్ బ్యాంకు లీడ్ బ్యాంకు డిపార్ట్‌మెంట్, రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) తదితర శాఖలు స్టాల్స్ ఏర్పాటుచేయగా మంత్రి నిమ్మల పరిశీలించారు.
ఆకట్టుకున్న శకటాలు
ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు ఆకట్టుకున్నాయి. వైద్యారోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, అగ్నిమాపక శాఖ, విద్యాశాఖ, ఎస్‌ఈఆర్‌పీ–జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, గృహ నిర్మాణ శాఖ, రవాణా శాఖల శకటాల ప్రదర్శన, పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జంతు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
దేశభక్తిని చాటేలా పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలు ఉత్తేజాన్ని రేకెత్తించాయి. వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ, జేసీ టి.రాహుల్‌కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, ఆర్డీఓ ప్రసన్నకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధి లక్ష్యం : జిల్లాలో మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం వంటి పలు పనులు చేయాల్సి ఉందని, భవిష్యత్తులో జిల్లాకు అవసరమైన వనరులు కల్పించి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి స్థిరమైన అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

మువ్వన్నెల రెపరెపలు

మువ్వన్నెల రెపరెపలు

మువ్వన్నెల రెపరెపలు

మువ్వన్నెల రెపరెపలు

మువ్వన్నెల రెపరెపలు