
త్యాగధనుల స్ఫూర్తి.. స్వాతంత్య్ర దీప్తి
నరసాపురం/తాడేపల్లిగూడెం అర్బన్/తణుకు అర్బన్: ఎందరో మహానుభావుల బలిదానాలు, ప్రాణత్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న స్వాతంత్య్ర భార తాన్ని వారి స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాల్సిన బా ధ్యత అందరిపై ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. నరసాపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ ప తాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం 70 అడుగుల జాతీయ పతాకంతో పట్టణంలో వైఎస్సార్‌సీపీ శ్రే ణులతో కలిసి ర్యాలీ చేశారు. స్వాతంత్య్ర నాయకులను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తణుకులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. స్వాతంత్య్ర స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.
తాడేపల్లిగూడెం అర్బన్: తాడేపల్లిగూడెంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ
తణుకు అర్బన్: తణుకులో జాతీయ పతకానికి సెల్యూట్ చేస్తున్న మాజీ మంత్రి కారుమూరి

త్యాగధనుల స్ఫూర్తి.. స్వాతంత్య్ర దీప్తి

త్యాగధనుల స్ఫూర్తి.. స్వాతంత్య్ర దీప్తి