
ప్రజాస్వామ్యం అపహాస్యం
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెం అర్బన్ : పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్ర భుత్వం దౌర్జన్యంగా ఓట్లు వేసుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. శుక్ర వారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ఓటమి చెందితే ప్రజలకు సమాధానం చెప్పుకోలేమన్న భయంతో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అ క్కడి కలెక్టర్, డీఐజీ, డీఎస్పీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని విమర్శించారు. జ మ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం గుండాలను తీసుకువచ్చి స్థానిక ఓటర్ స్లిప్పులను లాక్కుని ఓట్లు వే యించారన్నారు. ఓటర్లు ప్రశ్నిస్తే వారిని పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారన్నారు.
గూడెంలో ఏబీసీడీ ట్యాక్స్ : తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో శాసనసభ్యుడి ఆధ్వర్యంలో ఏబీసీడీ ట్యాక్స్‌లు వసూలు చేస్తున్నారని కొట్టు ఆరోపించారు. ఏ అంటే అబ్బాయి ట్యాక్స్, బీ అంటే బొలిశెట్టి ట్యాక్స్, సీ అంటే కమిషనర్ ట్యాక్స్, డీ అంటే డెలప్‌మెంట్ ట్యాక్స్ అని అ న్నారు. ఏ పని కావాలన్నా ఏదో ఒక ట్యాక్స్ క ట్టాల్సిందే అన్నారు. ఇటీవల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకుంటే అబ్బాయి ట్యాక్స్ కట్టి వారు తప్పించుకున్నారన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేనకి చెందిన నాదెండ్ల మనోహర్ చర్యలు తీసుకోవా ల ని కోరారు. వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరిని పే కాట క్లబ్బులు పెట్టుకునేందుకు అనుమతిస్తామని ఎర చూపి జనసేనలో చేర్చుకున్నారని విమర్శంచారు. జెడ్పీటీసీ సభ్యులు రావాల్సిన బకాయి లు ఇస్తారన్న ఆశతోనే జనసేనలో చేరారని తెలి పారు. కొలుకులూరి ధర్మరాజు, ముప్పిడి సంపత్‌కుమార్, కర్రి భాస్కరరావు, జిడ్డు హరిబాబు, బండారు నాగు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): మహిళలకు ఉచిత బస్సులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సీ్త్ర శక్తి పథకాన్ని ప్రారంభించింది. భీమవరం కొత్త బస్టాండ్ ఆవరణలో పథకాన్ని రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, కలెక్టర్ సీహెచ్ నాగరాణి, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రా మాంజనేయులు ప్రారంభించారు. రాష్ట్ర మ హిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్‌పర్సన్ పీతల సుజాత, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు టౌన్: దేశ సమైక్యత, సమగ్రతకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. ఏలూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పోలీసులు కృషి చేయాలని అన్నారు.
ఏలూరు (టూటౌన్): యువత దేశభక్తితో పా టు స్ఫూర్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. ఏలూరులోని జిల్లా కోర్టు కార్యాలయంలో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సైనికులు నిరంతరం కృషి చేస్తున్నారని, కాని దేశంలో అంతర్గతంగా భద్రత, అభివృద్ధి మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజాస్వామ్యం అపహాస్యం

ప్రజాస్వామ్యం అపహాస్యం