
తాగునీటికి ఇక్కట్లు
భీమవరం కలెక్టరేట్ వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తాయి. ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో హాజరుకాకపోగా.. పథకాలను ప్రదర్శించే శకటాల సంఖ్య బాగా తగ్గింది. అలాగే విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా ప్రాంగణం వద్ద మంచినీటి కోసం ఇబ్బందులు తప్పలేదు. వాటర్ టిన్నులు కొద్దిసేపటికే ఖాళీ అయ్యాయి. ప్లాస్టిక్ నిషేధం అని పెద్ద ఎత్తున ప్రచారం చేసినా అధికారులకు మాత్రం ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు అందించారు. అలాగే ఓ పక్క వేడుకలు జరుగుతుండగానే.. ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మొక్కలను వాహనంలోకి ఎక్కించి తరలించడం విశేషం. వేడుకలకు పెద్దగా ప్రజలు హాజరుకాలేదు.

తాగునీటికి ఇక్కట్లు