
విద్యుత్ విజిలెన్స్ దాడులు
కై కలూరు: విద్యుత్ మీటర్ల వినియోగంపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు కై కలూరు మండలంలో బుధవారం చేశారు. విజిలెన్స్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు చాగంటి వాసు నేతృత్వంలో 43 బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. మండలంలో కై కలూరు, ఆటపాక, గోపవరం, రాచపట్నం, తామరకొల్లు, వింజరం, వేమవరప్పాడు గ్రామాల్లో మొత్తం 3,009 వివిధ కేటగిరీల సర్వీసులను విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేశాయి. వీటిలో మొత్తం 525 సర్వీసుల నిబంధనలు అతిక్రమించినట్లు నిర్థారించి వారి వద్ద నుంచి రూ.11,40,600 జరిమానాలు వసూలు చేశారు. కార్యక్రమాల్లో గుడివాడ ఈఈ జీబీ శ్రీనివాసరావు, కైకలూరు డీఈఈ బి.రామ య్య, కై కలూరు టౌన్ సెక్షన్ ఏఈ కె.శ్రీనివాసమూర్తి, గుడివాడ డివిజన్ ఏఈలు, డీఈఈలు, ఏ ఈఈ లు, జేఈలు,లైన్ ఇన్‌స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికుడి మృతి
నరసాపురం: దీర్ఘకాలంగా మున్సిపాలిటీలో పర్మినెంట్ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న ఉల్లంపర్తి కృష్ణమూర్తి (59) గుండెపోటుతో బుధవా రం మృతి చెందారు. పట్టణంలోని అరుంధతి పేటకు చెందిన ఉల్లంపర్తి కృష్ణమూర్తి ప్రతి రోజూ మాదిరిగానే బుధవారం ఉదయం 4 గంటలకు వచ్చి 6వ వార్డులో విధులు నిర్వహిస్తున్నాడు. 11 గంటల ప్రాంతంలో కోవెలగుడి వీధిలో పనిచేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. సహచర కార్మికులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కృష్ణమూర్తికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కృష్టమూర్తి విధుల్లో అంకితభావంతో పనిచేస్తూ వార్డు ప్రజలతో తలలో నాలుకలా ఉంటాడని, అతడి మరణం బాధాకరమని పలువురు పేర్కొన్నారు. కృష్ణమూర్తి మృతిపట్ల మున్సిపల్ చైర్‌పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, కమిషనర్ అంజయ్య సంతాపం తెలిపారు.

విద్యుత్ విజిలెన్స్ దాడులు