
పొట్టి శ్రీరాములుతో కలిసి జైలు జీవితం
మా నాన్న పేరు కంతేటి కాశీ విశ్వనాథం. 4గురు మగ, 4గురు ఆడ సంతానం. మా నాన్న గుడ్లవల్లేరులో ఉండగా ఉద్యమంలో పాల్గొన్నందుకు బాపట్ల జైలులో పెట్టారు. అక్కడ పొట్టి శ్రీరాములు, నాన్న పక్కపక్కనే జైలు జీవితం అనుభవించారు. నాన్నకు ప్రభుత్వం తామ్రపత్రం అందించింది. కలిదిండి మండలంలో 5 ఎకరాలు పొలం ఇచ్చారు. కై కలూరులో కాశీరాజు కిరాణాకొట్టుగా నడిపారు.
– కంతేటి శ్యామ్ సుందర జగన్నాథరావు, భీమవరం
ఆదర్శవాది అచ్యుతరామయ్య
మా నాన్న పేరు చిర్రవూరి అచ్యుతరామయ్య. ముగ్గురు ఆడ, ఒక మగ సంతానం. స్వాతంత్య్ర ఉద్యోమంలో అనేక పోరాటాలు చేశారు. మెడికల్ రిప్రజంటేటీవ్‌గా అప్పట్లో పనిచేశారు. ఆయన మాకు ఎన్నో స్వాతంత్య్ర ఘట్టాలను వివరించేవారు. కై కలూరు ప్రాంతంలో అనేక ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన 1966లో మరణించారు. ఆయన కుమారుడిగా పుట్టడం గర్వంగా ఉంది.
– చిర్రవూరి శివరామశాస్త్రి, హైదరాబాద్
ఆచార్య ఎన్జీ రంగా శిష్యుడు
మా నాన్న పేరు ఉప్పాల కోదండరామయ్య. ఆచార్య ఎన్జీ రంగా ప్రియశిష్యులు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయనకు ఏడుగురు మగపిల్లలు, ముగ్గరు ఆడపిల్లలు సంతానం. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లి అక్కడ జైళ్లు నిండటంతో తెనాలిలో బంధించారు. ఆయన 101 సంత్సరాలు జీవించారు. ఆయన చూపిన మార్గం మాకు ఎంతో ఆదర్శం.
– ఉప్పాల రవీంద్రబాబు, కై కలూరు

పొట్టి శ్రీరాములుతో కలిసి జైలు జీవితం

పొట్టి శ్రీరాములుతో కలిసి జైలు జీవితం