
ఆత్మీయ కలయిక
తణుకు అర్బన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ మంత్రి, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను కలిశారు.
వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
సాక్షి, భీమవరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం భీమవరం రానున్న నేపథ్యంలో హెలీప్యాడ్ ప్రాంతాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, భీమవరం నియోజకవర్గ ఇన్‌చార్జి చినమిల్లి వెంకటరాయుడు మంగళవారం పరిశీలించారు. వీఎస్‌ఎస్ గార్డెన్స్‌లో జరగనున్న ఉంగటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యేందుకు జగన్ వస్తున్న విషయం తెలిసిందే. జననేతకు స్వాగతం పలుకుతూ పార్టీ శ్రేణులు, అభిమానులు హెలీపాడ్ నుంచి వేదిక వరకూ ఫ్లెక్సీలతో ముంచెత్తారు.