
అసభ్యకర పోస్టులపై చర్యలు తీసుకోవాలి
తూర్పుగోదావరి ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
ద్వారకాతిరుమల: మాజీ హోం మంత్రి, వైఎస్సార్‌సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనితపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాలి వేణు సోమవారం జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ద్వారకాతిరుమల మండలానికి చెందిన పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు. దళిత మహిళ అని కూడా చూడకుండా నల్లజర్ల గ్రామానికి చెందిన సవలం రామకృష్ణ ఈ నెల 7న రాత్రి తన ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి వనితను అవమానపరిచేలా పోస్టు పెట్టాడన్నారు. ఈ పోస్ట్‌ను వేళ్లచింతలగూడెంకు చెందిన మద్దిపాటి మహేష్, నేకూరి చంద్రం, దేవరపల్లి మండలం లక్ష్మీపురానికి చెందిన నగ్గిన నాగేంద్రలు షేర్‌లు చేశారన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని ఎస్పీని కోరినట్టు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ద్వారకాతిరుమల మండల కన్వీనర్ ప్రతాపనేని వాసు, పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు మల్లిపూడి నాగమణి, మండల ఎస్సీసెల్ అద్యక్షుడు దాసరి రాంబాబు, బంకా అప్పారావు, పొనమాల ఉమామహేశ్వరరావు, పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ సెక్రటరీ వామిశెట్టి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.