
రేపు వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా..
సాక్షి, భీమవరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం భీమవరం విచ్చేయనున్నారు. ఉంగటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. జగన్ పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం పార్టీ కేంద్ర కా ర్యాలయం విడుదల చేసింది. 13న మ ధ్యాహ్నం 3.15 గంటలకు తాడేపల్లిలోని నివాసం వద్ద నుంచి 3.20 గంటలకు హెలీప్యాడ్‌కు వస్తారు. 3.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4.15 గంటలకు భీమవరంలోని వీఎస్‌ఎస్ గార్డెన్స్ సమీపంలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గం గుండా 4.35 గంటలకు వివాహ వేదిక వీఎస్‌ఎస్ గార్డెన్‌కు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం 5.10 గంటలకు హెలీప్యాడ్ నుంచి తాడేపల్లి బయలుదేరి వెళతారు.
పాములపర్రు సమస్యను పరిష్కరించాలి
ఉండి: మండలంలోని పాములపర్రులో జరుగుతున్న శ్శశాన వాటికలో రోడ్డు నిర్మాణ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్ నర్సింహరాజు అన్నారు. సోమవారం పెదఅమిరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పాములపర్రులో దళితులపై దాడి ఘటన బాధాకరమన్నారు. శ్మశాన వాటిక వంటి సున్నిత అంశాల్లో అధికారులు మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేదని అన్నారు. ఎవరి మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతినకుండా నిర్ణయం తీసుకోవాలన్నారు. దళితుల సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని కోరారు. దళితులకు న్యాయం జరిగేలా వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. ఘటనను నిశితంగా పరిశీలిస్తున్నామని, పార్టీ అధినాయకులకు సమాచారం అందించామన్నారు. అధికార పార్టీ వారు ముందుకు వస్తే తాము కూడా ముందుకు వస్తామని, సమస్యను పరిష్కరించేలా కృషి చేద్దామని పీవీఎల్ అన్నారు.
గుంతలు పూడ్చివేత
కాళ్ల: రాష్ట్రీయ రహదారిపై కాళ్ల పరిధిలో హై స్కూల్ సమీపంలో గుంతలను పూడ్చారు. ‘గుంతలు పూడ్చండి.. చింతలు తీర్చండి’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. హైస్కూల్ సమీపంలోని టర్నింగ్‌లో గుంతలను సోమవారం పూడ్పించారు.
పరిష్కారంలో జాప్యం తగదు
భీమవరం: పోలీసు శాఖకు వచ్చే ప్రజా ఫిర్యా దుల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పో లీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా 12 మంది నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ఆయా సమ స్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు పాల్గొన్నారు.
నులి పురుగుల నివారణతో ఆరోగ్యం
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యాక్రమం పోస్టర్‌ను కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆవిష్కరించారు. నులి పురుగులతో పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుందని, వీటిని నివారించడం ద్వారా ఆరోగ్యం సమకూరుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా పిల్లలకు మాత్రల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. డీఎంహెచ్‌ఓ జి.గీతాబాయి, ఆర్‌బీఎస్‌కే పీఓ సీహెచ్ భావన తదితరులు పాల్గొన్నారు.

రేపు వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా..

రేపు వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా..

రేపు వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా..