
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించం
కలెక్టర్ నాగరాణి
భీమవరం (ప్రకాశం చౌక్): ప్రజాసమస్యల పరి ష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)లో అర్జీల పరిష్కారంలో జిల్లా వెనుకబడి ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టా లని అధికారులకు సూచించారు. మొత్తం 180 అర్జీలను స్వీకరించారు. డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, డ్వా మా పీడీ కేసీహెచ్ అప్పారావు, సచివాలయాల అధికారి వై.దోసిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● భీమవరం 12 వార్డు బ్రిడ్జి పేట పంట కాలువ పక్క రోడ్డును ఆనుకుని 40 ఏళ్లగా నివాసం ఉంటున్నామని, రోడ్డు విస్తరణలో మా ఇళ్లు తొలగించారని ఈ ప్రాంత వాసులు కలెక్టర్ వద్ద మొరపెట్టుకున్నారు.
● పాలకోడేరు మండలం కొరుకోల్లులోని దళితపేటలో ప్రభుత్వానికి చెందిన 2 సెంట్ల భూమి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించగా అధికారులు ఇంటి స్థలంగా పట్టాలు ఇచ్చారని దళితపేటవాసులు ఫిర్యాదు చేశారు.
ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం
ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని, మాలల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్, దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్‌కుమార్ అ న్నారు. కలెక్టరేట్ వద్ద మాల సంఘాల జేఏసీ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.
దేశ సమైక్యతకు పాటుపడాలి
భీమవరం: యువత దేశ సమగ్రత, సమైక్యతకు పాటుపడాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. సోమవారం ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీని స్థానిక ఎస్‌ఆర్‌కేఆర్ కళాశాల వద్ద ఆమె ప్రారంభించారు. ఈనెల 13 నుంచి 15 వరకు ఇళ్లు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో జెండాలను ఎగురవేయాలని ఆమె అన్నారు. అనంతరం సుమారు 2 వేల మంది విద్యార్థులతో 200 మీటర్ల భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూని ర్యాలీ నిర్వహించారు.