
ఇసుక దందా
స్నాతకోత్సవానికి నిట్ సిద్ధం
తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ 7వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. శనివారం ఉదయం వేడుకలు ప్రారంభం కానున్నాయని ఇన్‌చార్జి డైరెక్టర్ తెలిపారు. 8లో u
పెనుగొండ: ఇసుక అక్రమ నిల్వలు కాసులు కురిపిస్తున్నాయి. ఆచంట మండలంలో కూటమి నాయకులు భారీ ఎత్తున ఇసుకను అక్రమంగా నిల్వ చే శారు. గోదావరికి వరద నీరు రావడంతో నెమ్మదిగా అమ్మకాలకు తెరలేపారు. ఇసుక అమ్మకాలు జో రుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజులుగా ఆచంట మండలంలో ఇసుక అమ్మకాలు వి చ్చలవిడిగా సాగుతున్నాయి. ఐదు యూనిట్ల ఇసుక రూ.9 వేలకు విక్రయిస్తున్నారు. సిద్ధాంతం నుంచి నరసాపురం వరకూ ఇసుక తవ్వకాలకు గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరంతో ర్యాంపు తెరుచుకోలేదు. అయినా పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా నిర్వహించి మండలంలో పలుచోట్ల నిల్వ ఉంచారు.
వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ల ఫిర్యాదు
ఆచంట మండలంలో ఇసుక అక్రమల నిల్వలపై వైఎస్సార్ సీపీ సర్పంచ్‌లు కొందరు ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణం ఇసుకను స్వాధీ నం చేసుకోవాలని డిమాండ్ చేసినా అధికారుల నుంచి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఇసుక నిల్వ చేసిన కూటమి నేతలు అమ్మకాలు ప్రారంభించా రు. గుట్టలు త్వరగా ఖాళీ చేసి ఎలాంటి నిల్వలు లే వని నమ్మించాలని చూస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు అంటున్నారు. అక్రమార్కులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శిస్తున్నారు. సత్వరం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.