మధ్యప్రదేశ్‌లో వ్యాన్ బోల్తా.. కొల్లేరు వాసి మృతి
కై కలూరు: చేపల లోడ్‌తో వెళుతూ మధ్యప్రదేశ్ రాష్ట్ర జబ్బల్‌పూర్ వద్ద వ్యాన్ బోల్తా పడటంతో పందిరిపల్లిగూడెంకు చెందిన వ్యాన్ డ్రైవర్ కర్ణం చిరంజీవి చంద్రమౌళి (27) జూలై 31న మరణించాడు. ఇదే ప్రమాదంలో నత్తగుళ్ళపాడుకు చెందిన క్లీనర్ దావీదుకు తీవ్ర గాయాలయ్యాయి. ఫంగస్ చేపల లోడుతో వెళుతున్నా వ్యాన్ అక్కడ డివైడర్‌ను ఢీకొట్టడంతో బోల్తా పడింది.
విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు వెళ్లగా పోస్టుమార్టం అనంతరం చిరంజీవి మృతదేహాన్ని బుధవారం గ్రామానికి తీసుకొచ్చారు. చిరంజీవికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాష్ట్ర వడ్డీ సాధికారిత కమిటీ చైర్మన్ బలే ఏసురాజు, పలువురు కొల్లేరు పెద్దలు చిరంజీవి భౌతికకాయానికి నివాళి అర్పించారు. చిరంజీవి మరణంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.