
విద్యా శక్తి కార్యక్రమం బహిష్కరణ
భీమవరం: పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టిన విద్యాశక్తి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు బహిష్కరిస్తున్నట్లు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ విజయరామరాజు, జనరల్ సెక్రటరీ జి.ప్రకాశం చెప్పారు. బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు విజయరామరాజు, ప్రకాశం మాట్లాడుతూ విద్యాశక్తి కార్యక్రమం ఐచ్ఛికం మాత్రమేనని నిర్బంధం కాదని ప్రభుత్వం తెలిపినా కొంతమంది అధికారులు నిర్బంధంగా చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. దీనితో విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కో చైర్మన్ సాయివర్మ, ఎన్.శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ రమణ, కోశాధికారి పట్టాభిరామయ్య తదితరులు పాల్గొన్నారు.