
వృద్ధురాలి మృతదేహం లభ్యం
తాడేపల్లిగూడెం (టీఓసీ): స్థానిక శివాలయం వద్ద కాలువలో పడిపోయి గల్లంతైన చంద్రవతి (70) వృద్ధురాలి మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. ఈనెల 4వ తేదీన ఆమె కాలువలో పడిపోగా, అధికారులకు అందిన సమాచారం మేరకు 5వ తేదీన ఫైర్, పోలీస్ డిపార్ట్‌మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కాలువలో బోట్ సహాయంతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. కడకట్ల సమీపంలో బుధవారం మధ్యాహ్నం చంద్రవతి మృతదేహాన్ని బయిటకు తీశారు. ఫైర్ సిబ్బందిచే మృతదేహాన్ని పోలీస్ శాఖకు అప్పగించారు. మృతురాలి బంధువులు హాజరయ్యారు.