
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
పాలకొల్లు సెంట్రల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి నెలా పదిహేను రోజులుగా చికిత్స పొందుతున్న వ్యక్తి బుధవారం మృతి చెందాడు. వివరాల ప్రకారం.. మండలంలోని ఉల్లంపర్రు గ్రామానికి చెందిన దోస నరసింహస్వామి (56) జూన్ 19వ తేదీన గ్రామం నుంచి పాలకొల్లు పట్టణానికి వస్తుండగా కెనాల్ రోడ్డులో వాటర్ వర్క్స్ ప్రాంతంలో వెనుక నుంచి మినీ వ్యాన్ ఢీకొట్టడంతో తలకు తీవ్రమైన గాయమైంది. స్థానికులు వెంటనే స్పందించి పట్టణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి గుంటూరు తరలించగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బ్రెయిన్‌కు చికిత్స చేశారు. అప్పటి నుంచి అపస్మారకస్థితిలోనే ఉన్న స్వామి బుధవారం ఉదయం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. నరసింహస్వామికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇతను పట్టణంలో ఓ ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్‌ను నడుపుతుండేవారు. పట్టణ ఎస్సై పృధ్వీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనామా నిర్వహించారు.