
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
భీమవరం: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వో ఎం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వీఎస్ సాయిబాబా, ఎలక్ట్రానిక్స్ మీడియా అధ్యక్షుడు జక్కంశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యుడు యర్రంశెట్టి గిరిజాపతి మాట్లాడుతూ గత ఏడాది కాలంగా జర్నలిస్టు అక్రిడిటేషన్లను మూడు నెలలకు ఒకసారి పొడిగించడంతో కొత్తగా అక్రిడిటేషన్లు తీసుకునేవారికి అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే అర్హత గల జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులందరకీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని, హెల్త్ ఇన్యూరెన్స్ స్కీమ్ అమలు వంటి డిమాండ్స్ తక్షణం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ నాయకులు వంగల లింగమూర్తి, కేఎస్‌ఆర్‌కే గోపాలకృష్ణ, బి రామాంజనేయులు, పట్టణ కార్యదర్శి కమ్మిలి హనుమంతరావు, ఎన్ సత్యనారాయణ, విజయరాజు పాల్గొన్నారు.