రైతులను నిండా ముంచిన కూటమి సర్కారు | - | Sakshi
Sakshi News home page

రైతులను నిండా ముంచిన కూటమి సర్కారు

Aug 5 2025 11:04 AM | Updated on Aug 5 2025 11:04 AM

రైతులను నిండా ముంచిన కూటమి సర్కారు

రైతులను నిండా ముంచిన కూటమి సర్కారు

భీమవరం(ప్రకాశం చౌక్‌): రైతులను అన్ని రకా లుగా కూటమి ప్రభుత్వం మోసం చేసిందని, ఈ పాలనలో రైతులకు నిండా కష్టాలేనని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అ న్నారు. రైతుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం రైతులతో కలిసి జిల్లా నాయకులు భీమవరం కలెక్టరేట్‌కు వచ్చి ఇన్‌చార్జి కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హమీ మేరకు ఏటా కేంద్రం సాయంతో కలిపి రూ.26 వేలు ఇవ్వాల్సి ఉండగా తొలి ఏడాది ఎగ్గొట్టారని, ఈ ఏడాది కేవలం రూ.5 వేలు ఇచ్చి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రెండేళ్లకు రూ.40 వేలు బకాయి ఉంటే రూ.5 వేలు జ మచేయడం మోసం కాదా అని ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, పురుగు మందులు అందుబాటులో లేక బ్లాక్‌లో రైతులు కొంటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఇప్పటికీ సుమారు రూ.6 వేల కోట్ల ధాన్యం బకాయిలు రైతులకు చెల్లించాల్సి ఉందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల్లో ఎరువు లు, పురుగు మందులు పుష్కలంగా ఉండేవని, విత్తు నుంచి ధాన్యం కొనుగోలు వరకూ రైతులకు అండగా నిలిచామన్నారు. నాడు ఆక్వా రైతులకు చిన్నపాటి సమస్య వస్తే జగన్‌పై నెట్టేసిన కూటమి నాయకులు నేడు ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రొయ్యల ధరలు తగ్గుతున్నా, ఫీడ్‌, సీడ్‌ ధరలు పెరుగుతున్నా నియంత్రణ లేదన్నారు. గత ప్రభుత్వంలో ఆక్వా రైతులకు సబ్సిడీపై విద్యుత్‌ అందించి అండగా నిలిచామన్నారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్‌, భీమవరం ఇన్‌చార్జి చినమిల్లి వెంకట్రాయు డు, ఉండి ఇన్‌చార్జి పీవీఎల్‌ నరసింహరాజు, మొగల్తూరు జెడ్పీటీసీ తిరుమాని బాపూజీ, యలమంచిలి ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి, పార్టీ నాయకులు యడ్ల తాతాజీ, కోడే యుగంధర్‌, నంద్యాల సీతారామయ్య, వేగేశ్న జయరామకృష్ణంరాజు, పాలపర్తి కృపానాథ్‌, చెన్ను విజయ్‌, ఉచ్ల స్టాలిన్‌, గణేశ్న రాంబాబు, పాలారాంబాబు, గళవెల్లి ధనుంజయ, డొక్కు సుబ్రహ్మణ్యం, గంటా సుందర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతు భరోసా సాయంలో కోత

ఆక్వా రైతులకు సహకారం కరువు

రైతుల సమస్యలపై వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో వినతిప్రతం అందజేత

నారుమడులు ఎండినా పట్టదా?

మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ జిల్లాలోని ఇరిగేషన్‌ మంత్రి నిమ్మల రామనాయుడు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు, గానీ ఆచంట, పోడూరు, యలమంచిలి మండలాల్లో నారుమడులకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదన్నారు. దీంతో నాట్లు ఆలస్యమవుతున్నాయన్నారు. ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, పది రోజుల్లోపు ఎరువులు అందించకపోతే రైతులు నష్టపోతారన్నారు. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా చేతులు ఎత్తేసిందన్నారు.

వ్యవసాయం దండగలా..

పార్టీ పార్లమెంట్‌ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వంలో వ్యవసాయం పండగా ఉండగా.. నేడు చంద్రబాబు పాలనలో దండగ అనే రీతిలో రైతులు కష్టాలు పడుతున్నారన్నారు. సార్వా రైతులకు ఎరువులు, పురుగు మందులు అందుబాటులో లేకపోవడం దారుణమన్నారు. నరసాపురం పార్లమెంట్‌ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, పురుగు మందులు, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచేందుకు రైతుల తరఫున పోరాటం చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement