ఈ శ్రావణంలోనైనా ఇచ్చేనా? | - | Sakshi
Sakshi News home page

ఈ శ్రావణంలోనైనా ఇచ్చేనా?

Aug 4 2025 5:24 AM | Updated on Aug 4 2025 5:24 AM

ఈ శ్ర

ఈ శ్రావణంలోనైనా ఇచ్చేనా?

గత ప్రభుత్వంలో 2,560 మందికి ఫ్లాట్లు

2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పాలకొల్లులో పేదల ఇళ్ల నిర్మాణం కోసం పెంకుళ్లపాడు, రామయ్యహాలు, పెదగరువు ప్రాంతాల్లో సుమా రు 70 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. పెంకుళ్లపాడులో 50 ఎకరాలు భూమిని కేటాయించారు. 2014లో టీడీపీ హయాంలో పెంకుళ్లపాడులో 6,144 మంది లబ్ధిదారుల కోసం (ఒక్కో బ్లాక్‌లో ఒక్కో ఫ్లోర్‌కు 8 పోర్షన్ల చొప్పున 4 ఫ్లోర్‌లకు 32 పోర్షన్లు) 192 బ్లాక్‌ల నిర్మాణం చేపట్టారు. 2019 ఎన్నికలకు ముందు పనులు పూర్తికాకుండానే ఎమ్మెల్యే నిమ్మల గృహప్రవేశాలు అంటూ హడావుడి చేశారు. అయితే ఫ్లాట్లను మాత్రం లబ్ధిదారులకు అప్పగించలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 80 బ్లాక్‌ల పనులు పూర్తిచేసి 2,560 మంది లబ్ధిదారులకు ఫ్లాట్లను అప్పగించగా వారంతా నివాసముంటున్నారు. ఇంకా 112 బ్లాక్‌ల పనులు పూర్తికావాల్సి ఉంది. ఈ లెక్కన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలోనే సుమారు 42 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే ఎమ్మెల్యే నిమ్మల మాత్రం 2019 నాటికే 90 శాతం పనులు పూర్తయ్యాయంటూ చెప్పుకుంటూ వచ్చారు.

పాలకొల్లు సెంట్రల్‌: అధికారమే పరమావధిగా కూట మి నాయకులు ఎన్ని బూటకపు హామీలైనా ఇస్తారనడానికి పాలకొల్లులో టిడ్కో ఇళ్ల పంపిణీయే నిదర్శనం. ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి తీరా గద్దెనెక్కిన తర్వాత హామీలను బుట్టదాఖలు చేయడం కూటమి నాయకులకు పరిపాటిగా మారింది. 2024 ఏప్రిల్‌ 6న పాలకొల్లులో జరిగిన టీడీపీ ఎన్నికల సభలో స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ శ్రావణమాసంలో టిడ్కో లబ్ధిదారులతో గృహప్రవే శాలు చేయిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో శ్రావణ మాసం ముగియగా ఈ ఏడాదిలో రెండో శ్రావణం కూడా వచ్చింది. అయినా టిడ్కో ఇళ్ల పనుల్లో పురోగతి లేదు. దాదాపు 30 శాతం వరకు పనులు మిగిలి ఉన్నాయి. ఇంకెన్ని శ్రావణాలు ఎదు రుచూడాలని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.

10 శాతం పనులే అంటూ..

స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి నిమ్మల 2019 ఎన్నికల్లో పెంకుళ్లపాడు టిడ్కో గృహాలు పనులు పూర్తికాకుండానే గృహ ప్రవేశాలు చేయించారు. లబ్ధిదారులకు పత్రాలు తప్ప ఎవరికీ ఇళ్లు ఇవ్వలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల వరకూ టిడ్కో గృహాల్లో పనులు టీడీపీ హయాంలోనే 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం పనులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేయలేదంటూ తప్పుడు ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే పనులు పూర్తిచేసి శ్రావణంలో ఫ్లాట్లు ఇస్తామంటూ వాగ్దానాలూ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది.. 10 శాతం పనులు వెంటనే పూర్తిచేసి ఫ్లాట్లు అప్పగిస్తారని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూశారు. అయితే వారికి నిరాశే ఎదురైంది.

112 బ్లాక్‌ల్లో పనులు

ప్రస్తుతం టిడ్కో గృహాల్లోని 112 బ్లాక్‌ల్లో పనులు జరుగుతున్నాయి. పెయింటింగ్‌, ప్లంబింగ్‌ పనులు చేస్తున్నారు. సుమారు 70 శాతం పనులు పూర్తికాగా మిగిలిన పనులు జరుగుతున్నాయి. మొత్తం పనులన్నీ పూర్తికావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

గూడు.. గోడు

టిడ్కో గృహాల పంపిణీకి కూటమి హామీలు

శ్రావణమాసంలో ఇస్తామంటూ వాగ్దానాలు

కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత రెండో శ్రావణం

ఇంకా 30 శాతం పనుల పెండింగ్‌

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2,560 మందికి ఫ్లాట్లు అందజేత

నువ్వు ఇంజనీరింగ్‌ ఎక్కడ చదివావయ్యా అంటూ..

టిడ్కో గృహాల లబ్ధిదారుల కోసం నరసాపురం రోడ్డును కలుపుతూ పాలకొల్లు–నరసాపురం కెనాల్‌పై వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇటీవల వంతెన వద్ద బస్టాండ్‌ నిర్మాణ పనులపై ఓ ఇంజనీరింగ్‌ అధికారిని నువ్వు ఇంజనీరింగ్‌ ఎక్కడ చేశావయ్యా అంటూ మంత్రి నిమ్మల ప్రశ్నించారు. భీమవరంలో ఓ ప్రైవేట్‌ కళాశాలలో చదివానని ఆయన సమాధానం చెప్పారు. వెంటనే మంత్రి ఆ కళాశాలకు ఫోన్‌ చేసి చిన్నపాటి పనులు చేయడంలోనూ అధికారులు తప్పిదాలు చేస్తుంటే మీ కళాశాలలోనే చదివారా అనే అనుమానం కలుగుతుందని అడిగినట్టు సమాచారం. దీంతో సదరు అధికారి అవమానంగా ఫీల్‌ అయ్యారని తెలిసింది. ఇలా మంత్రి తీరుతో నియోజకవర్గంలో అధికారులు భయంతో విధులు నిర్వహిస్తుండటం గమనార్హం.

ఇంకెన్ని శ్రావణాలు కావాలో..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే 42 శాతం పనులు పూర్తిచేసి 2,560 మందికి టిడ్కో ఇళ్లు అప్పగించాం. మంత్రి నిమ్మల మాత్రం గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 90 శాతం పనులయ్యాయని చెప్పుకున్నారు. ఆయన లెక్కల ప్రకారం పది శాతం పనులు పూర్తి చేయడానికి ఇంకా ఎన్ని శ్రావణ మాసాలు కావాలో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఈ శ్రావణ మాసం ముగిసేలోపు టిడ్కో గృహాలు అందిస్తే సంతోషిస్తాం. లేకుంటే 2029 ఎన్నికల వరకూ లబ్ధిదారులను మభ్యపెట్టాలనే ఆలోచనలో మంత్రి ఉన్నట్టు సందేశించాల్సి వస్తుంది.

–గుడాల శ్రీహరిగోపాలరావు, వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి, పాలకొల్లు

ఈ శ్రావణంలోనైనా ఇచ్చేనా? 1
1/2

ఈ శ్రావణంలోనైనా ఇచ్చేనా?

ఈ శ్రావణంలోనైనా ఇచ్చేనా? 2
2/2

ఈ శ్రావణంలోనైనా ఇచ్చేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement