
శ్రీవిష్ణు డెంటల్ కళాశాలలో రాష్ట్రస్థాయి సదస్సు
భీమవరం: పట్టణంలోని శ్రీవిష్ణు డెంటల్ కళాశాలలో 11వ ఐపీఎస్ రాష్ట్ర సమావేశం శనివారం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఏవీ రామరాజు చెప్పారు. ఈ సందర్భంగా ఫ్యాకల్టీ, విద్యార్థుల మార్పిడి, పరిశోధన, ప్రచురణలు, క్లినికల్ శిక్షణ వంటి కార్యకలాపాలకోసం విష్ణు డెంటల్ కళాశాల, వియత్నంలోని కాన్‌థో యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ ఫార్మసీ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు రామరాజు చెప్పారు. సమావేశంలో రాష్ట్రంలోని వివిధ డెంటల్ కళాశాలలకు చెందిన సుమారు 200 మంది ప్రతినిధులు పాల్గొనగా పీజీ విద్యార్థులు పరిశోధన పత్రాలను సమర్పించారన్నారు. కళాశాల వైస్ చైర్మన్ రవిచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
నిందితుల అరెస్ట్
టి.నరసాపురం: పొగాకు బేళ్లు చోరీ నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై జయబాబు తెలిపారు. వివరాల ప్రకారం.. మండంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన భూక్యా భాస్కరరావుకు చెందిన 14 పొగాకు బేళ్లు చోరీపై జూలై 28న ఫిర్యాదు చేశాడు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు శనివారం నలుగురిని నిందితులుగా గుర్తించి వారిని అరెస్ట్ చేసి అనంతరం రిమాండ్‌కు పంపారు. నిందితులతోపాటు పొగాకు బేళ్లు కలిగిన వాహనాన్ని సీజ్ చేశామన్నారు.