వెన్నుపోటు దినం సూపర్ సక్సెస్
యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా
కొయ్యలగూడెం మండలంలోని పలు ప్రాంతాలు మట్టి అక్రమార్కులకు అడ్డాగా మారాయి. రాత్రి వేళల్లో సాగునీటి చెరువుల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. 10లో u
● జిల్లావ్యాప్తంగా ప్రభుత్వంపైపెల్లుబికిన వ్యతిరేకత
● అన్ని వర్గాల ప్రజలూ భాగస్వాములయ్యారు
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి
నరసాపురం: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో వంచన, మోసాలను ప్రశ్నిస్తూ ప్రజలకు న్యాయం చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విజయవంతమయ్యాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నా రు. ప్రత్యేకించి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ నిర్వహించిన నిరసన ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, ఆవేదన పెల్లుబికిందన్నారు. నిరసనల్లో ప్రజలు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములయ్యారని వివరించారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వ పెద్దలు కళ్లు తెరవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలకు, పార్టీ పదవుల్లో వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు, పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. ఏడాది కాలంగా ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టి, ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై హామీలు అమలు చేసేలా ఒత్తిడి తేవడంలో మున్ముందు కూడా వైఎస్సార్‌సీపీ పెద్దెత్తున పోరాటాలు చేస్తుందని చెప్పారు. ఈ ఏడాది కాలంగా రైతులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారు కూటమి నిర్లిప్త పాలన కారణంగా నలిగిపోతున్నారన్నారు. 2019–24 కాలంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతి నెలా ఏదో ఒక పథకం రూపంలో ప్రజలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు జమచేసేదని గుర్తు చేశారు. కూటమి పాలనలో పనుల్లేక, చేతిలో చిల్లిగవ్వ లేకుండా పేదలు అప్పులు చేసుకుని జీవిస్తున్నారని ముదునూరి ఆవేదన వ్యక్తం చేశారు.


