జగనన్న కాలనీకి నీటి సరఫరా
ఆకివీడు: మండలంలోని కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని జగనన్న కాలనీలో గత మూడు రోజులుగా ఆగిన కుళాయి నీటిని ఎట్టకేలకు సోమవారం వదిలారు. మూడు రోజులుగా కుళాయిల ద్వారా నీరు రాకపోవడంతో కాలనీలోని సుమారు 1000 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాలనీవాసుల నీటి ఇబ్బందులపై ‘సాక్షి’లో కథనానికి జిల్లా, మండల రెవెన్యూ అఽఽధికారులు స్పందించారు. నీటి ఇబ్బందిని కలెక్టర్‌కు తెలియజేయడంతో తక్షణం నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో ఉదయం 10 గంటల ప్రాంతంలో కుళాయిలకు నీరు వదిలారు.
స్పందన
జగనన్న కాలనీకి నీటి సరఫరా


