జాతీయ స్థాయి పోటీలకు హేమ వర్షిణి
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట భవిత కేంద్రానికి చెందిన ఒమ్మి హేమ వర్షిణి జాతీయ స్థాయి స్పెషల్ ఒలంపిక్స్ పోటీలకు ఎంపికై ంది. ఇటీవల కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి బోసీ బాల్ విభాగంలో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయుడు కే.బాల ఈశ్వరయ్య వివరించారు. ఈ పోటీలు చత్తీస్‌ఘడ్‌లో జరగనున్నట్లు వెల్లడించారు. బాలిక హేమవర్షిణి ఇటీవల పదవ తరగతి ఉత్తీర్ణురాలైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఉపాధ్యాయుడు బాల ఈశ్వరయ్య, ఉపాధ్యాయులు విద్యార్థిని హేమ వర్షిణిని అభినందించారు.
బీచ్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
ద్వారకాతిరుమల: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో శుక్రవారం గల్లంతైన ద్వారకాతిరుమలకు చెందిన యువకుడు లాలూ నాయక్ (17) మృతదేహం శనివారం లభ్యమైంది. మండలంలోని కొమ్మర, కోడిగూడెం, ద్వారకాతిరుమల, సత్తెన్నగూడెం గ్రామాలకు చెందిన 10 మంది స్నేహితులతో కలసి లాలూ నాయక్ పేరుపాలెం బీచ్‌కు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో స్నానం చేస్తుండగా గల్లంతయ్యాడు. అర్ధరాత్రి సమయం నుంచి అతడి ఆచూకీ కోసం స్నేహితులు వెదకడం మొదలు పెట్టారు. అయితే నీటి మునిగిన ప్రాంతానికి 5 కిలో మీటర్ల దూరంలో, బీచ్ ఒడ్డున లాలూ నాయక్ మృత దేహం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అతడి అన్నయ్య చిన్నాకు కనిపించింది. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, కుటుంబ సభ్యులకు అప్పగించగా, వారు కొవ్వూరు ఘాట్‌లో ఖననం చేశారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
పెదవేగి : అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన దిబ్బగూడెంలో చోటుచేసుకుంది. పెదవేగి ఎస్సై కె రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన తేటకాల పావని మొదటి కుమార్తె మీనాక్షికి పెదవేగి మండలం దిబ్బగూడెం గ్రామానికి చెందిన బాల సురేష్‌తో ఐదేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి 19 నెలల ఆడబిడ్డ సంతానం ఉంది. వివాహ సమయంలో రూ.3 లక్షలు కట్నం ఇవ్వగా మిగిలిన రూ.2 లక్షలు గురించి భర్త, అత్త మామలు వేధిస్తున్నారని ఈనెల 25వ తేదీ రాత్రి మీనాక్షి తల్లి పావనికి ఫోన్ చేసి చెప్పింది. శనివారం మీనాక్షి చనిపోయిందని చెప్పారని, కానీ ఆమె ఒంటిమీద దెబ్బలు ఉన్నాయని మృతురాలు తల్లి పావని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె రామకృష్ణ తెలిపారు. మీనాక్షి మృతదేహాన్ని శవపంచనామ నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ వెంకటేశ్వరరావు చెప్పారు.
జాతీయ స్థాయి పోటీలకు హేమ వర్షిణి
జాతీయ స్థాయి పోటీలకు హేమ వర్షిణి


