ఏలూరు (టూటౌన్): అగ్గిపుల్లపై వ్యోమగామి సునీతా విలియమ్స్ చిత్రాన్ని చిత్రీకరించి అబ్బుర పరుస్తున్నారు ఏలూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు మేతర సురేష్‌బాబు. తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపి క్షేమంగా భూమిపైకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని తనదైన శైలిలో సునీతా విలియమ్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూక్ష్మ కళాకారుడు మేతర సురేష్ బాబుకు పలువురు అభినందనలు తెలియజేశారు.
కబడ్డీ పోటీల్లో తృతీయ స్థానం
పెదపాడు : వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఈనెల 14 నుంచి 16 వరకు జరిగిన 34వ సబ్‌జూనియర్ అంతర్ జిల్లా బాలబాలికల కబడ్డీ పోటీల్లో పెదపాడు మండలం వీరమ్మకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు తృతీయ స్థానం సాధించినట్లు హెచ్‌ఎం రాంప్రసాద్ తెలిపారు. కబడ్డీ పోటీల్లో విద్యార్థులు హర్ష, శాంతరాజు ప్రతిభ చాటారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.