రేపు జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

రేపు జాబ్‌మేళా

Nov 26 2026 1:47 AM | Updated on Nov 26 2026 1:47 AM

కాళోజీ సెంటర్‌: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 27న (శుక్రవారం) జా బ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బి.సాత్విక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన అపోలో ఫార్మసీ సంస్థలో 95 పోస్టుల భర్తీకి ఈ మేళా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఫార్మసిస్ట్‌ 25, ట్రైనీ ఫార్మసిస్ట్‌ 20, ఫార్మసీ అసిస్టెంట్‌ 25, రిటైల్‌ ట్రైనీ అసోసియేట్‌ 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు అర్హులని, ఫార్మసిస్ట్‌ పోస్టులకు డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీతో పాటు తెలంగాణ పీసీఐ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. హైదరాబాద్‌లో ఉ ద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 27న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వరంగల్‌ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ (బాయ్స్‌) ప్రాంగణంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

న్యూశాయంపేట: క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా ప్రభుత్వం అందించే పురస్కారాలకు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన క్రైస్తవ ప్రముఖులు, సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్‌ మైనార్టీ సంక్షేమాధికారి, మేన శ్రీను, వరంగల్‌ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేష్‌లు బుధవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. తెలంగాణ క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో అందించే పురస్కారాలకు నిర్ణీత నమూనా దరఖాస్తులు జిల్లా మైనార్టీ కార్యాలయాల్లో డిసెంబర్‌ 4వ తేదీలోగా అందించాలన్నారు. పూర్తి వివరాలకు డీఎండబ్ల్యూఓ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

పంచారామాలకు

ఆర్టీసీ ప్రత్యేక బస్సు

నర్సంపేట: నర్సంపేట ఆర్టీసీ డిపో నుంచి పంచారా మాల యాత్రకు టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యే క యాత్ర ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్‌ ఎం.సరస్వతి తెలిపారు. బుధవారం డీఎం మాట్లాడుతూ ఈనెల 29వ తేదీన సాయంత్రం 5గంటలకు 36 సీట్ల సూపర్‌ లగ్జరీ బస్సు బయలుదేరి డిసెంబర్‌ 1వ తేదీ సాయంత్రం 5గంటలకు తిరిగి నర్సంపేటకు చేరుకుంటుందన్నా రు. యాత్రలో అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాలను సందర్శించనుననట్లు పేర్కొన్నారు. ఒక్కరికి టికెట్‌ ధర రూ.2,300ఽ నిర్వహించడం జరిగిందన్నారు. వివరాలకు 9704644543, 998903 8476 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

రెండోరోజూ పిచ్చి కుక్క

స్వైర విహారం

నెక్కొండ: మండలకేంద్రంలో రెండో రోజూ పిచ్చి కుక్క స్వైర విహారంతో ఐదుగురుకి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. మండలకేంద్రంలో ఓ పిచ్చికుక్క మంగళవారం దాడి చేసిన ఘటనలో ఏడుగురికి గాయాలైన విషయం విదితమే. బుధవారం కూడా మరో ఐదుగురిపై దాడి చేయగా వారిని పీహెచ్‌సీలో చికిత్స అందించినట్లు వైద్యాధికారి రహేలా తన్వీర్‌ తెలిపారు. కుక్క కాటుకు పీహెచ్‌సీలో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. కాగా పిచ్చి కుక్క వీధుల్లో తిరుగుతుండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడదను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement