కల్లాలు లేక కష్టాలు! | - | Sakshi
Sakshi News home page

కల్లాలు లేక కష్టాలు!

Nov 25 2026 9:36 AM | Updated on Nov 25 2026 9:36 AM

జాతీయ రహదారులపై ధాన్యం ఆరబెడుతున్న రైతులు

ఖిలా వరంగల్‌: ఆరుగాలం శ్రమించి పంటలను సాగుచేస్తున్న రైతులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఈ వర్షాకాలంలో ఎల్‌నినో కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించి వరి సాగు చేసిన రైతులకు కష్టాలు తప్పడం లేదు. ధాన్యం చేతికి వచ్చిన పంటను ఆరబెట్టడం పెద్ద సమస్యగా మారుతోంది. వసతులు లేకపోవడంతో.. పంట పొలాలు, జాతీయ రహదారుల వెంట ఎక్కడ పడితే ధాన్యాన్ని ఆరబోయాల్సి పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా పంట కల్లాల నిర్మాణాల కోసం ఎస్సీ, ఎస్టీలకు రూ.80వేలు, ఇతరులకు రూ.70 వేల చొప్పున చెల్లించేందుకు నాటి పాలకులు నిర్ణయం తీసుకున్నారు. అయితే నిధులు విడుదలలో జాప్యం కావడంతో చాలా మంది రైతులు కల్లాలు నిర్మించుకోలేదు. ప్రస్తుతం గ్రామాల్లో సరైన స్థలాలు లేక, పచ్చి ధాన్యాన్ని ఆరబోసేందుకు స్థలాలు లేక రైతులు సతమతమవుతున్నారు. జిల్లాలో వ్యవసాయంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. రైతులు పత్తితోపాటు వరి, పసుపు, వేరుశనగ, సోయా, జొన్న, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారు. ధాన్యం చేతికొచ్చిన తర్వాత ఆరబెట్టేందుకు ప్రత్యేకంగా ప్రదేశాలు ఏమిలేవు. దీంతో జాతీయ రహదారుల వెంట, ఖాళీల ప్రదేశాల్లో ఆరబోస్తున్నారు.

ఎక్కడ చూసిన ధాన్యం రాశులే..

జిల్లాలో వరి పంటలు చేతికి రావడంతో జిల్లాలో ఎక్కడ చూసినా రహదారులపైనే ధాన్యం రాశులు కనిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో స్థలాలు లేకపోవడంతో విసుగు చెందిన పలువురు రైతులు వ్యాపారులకు తక్కువ ధరకే పచ్చి ధాన్యాన్ని విక్రయిస్తున్న పరిస్థితి నెలకొంది. సొంతంగా కల్లాలు ఉంటే ఆరబోసుకుని నేరుగా ఆశించిన ధరలకు విక్రయించుకునే వీలుంటుందని రైతులు వాపోతున్నారు. సమయం కూడా ఆదా అయ్యే అవకాశం ఉంది. శాశ్వత కల్లాలు అందుబాటులో ఉంటే రహదారుల వెంట ఆరబోసే పరిస్థితులు రాదని అన్నదాతలు చెబుతున్నారు.

వరి సాగు విస్తీర్ణం ఎకరాలు

జిల్లాలో రైతులు

ప్రమాదాలకు నిలయం..

జిల్లాలోని పలు జాతీయ రహదారులపై ధాన్యం ఆరబెడుతూ వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగటి పూట రోడ్డుకు ఇరువైపులా ధాన్యం పోసి రహదారులను కుదించడంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు తప్పించుకునే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని, రాత్రి వేళ ధాన్యం కనిపించక వాహనాలు అదుపు తప్పే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రహదారులపై ధాన్యం ఆరబోసిన రైతులకు సరైన అవగాహన కల్పించాలని వాహనచోదకులు వాపోతున్నారు.

పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు

శాశ్వత కల్లాలు నిర్మించాలంటున్న అన్నదాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement