వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Nov 12 2026 5:24 AM | Updated on Nov 12 2026 5:24 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 12 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

కేఎంసీని అగ్రస్థానంలో నిలపాలి

వరంగల్‌ కేఎంసీని తెలంగాణ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ రమేశ్‌రెడ్డి అన్నారు.

● హనుమకొండ అడ్వకేట్స్‌ కాలనీలోని ఓ ప్రముఖ జ్యూస్‌ సెంటర్‌లో మే 20న అధికారులు తనిఖీలు నిర్వహించారు. కుళ్లిన అవకాడో, మామిడి పండ్లు, బూజు పట్టిన పుచ్చకాయలు, అంజీరా పండ్లతో జ్యూస్‌లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పైఅంతస్తులోని ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రంలో నల్లగా మారిన వంటనూనె, బూజుపట్టిన చికెన్‌ మంచూరియా బయటపడ్డాయి. జ్యూస్‌లో ప్లాస్టిక్‌ ముక్కలు కనిపించాయని ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

● సెప్టెంబర్‌ 11న హనుమకొండలో హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలపై తనిఖీలు చేశారు. వంటగదుల్లో బొద్దింకలు, ఈగలు, కుళ్లిన ఆహార పదార్థాలు కనిపించాయి. అనుమానాస్పద ఆహారం, నీటి నమూనాలను అధికారులు సేకరించి పరీక్షలకు పంపించారు.

●గ్రేటర్‌ వరంగల్‌లో 10 ప్రత్యేక బృందాలతో 20 ఆహార తయారీ కేంద్రాల్లో అధికారులు అక్టోబర్‌ 29న తనిఖీలు చేశారు. స్వీట్ల తయారీలో ముఖానికి రాసుకునే ఫేషియల్‌ రోజ్‌వాటర్‌ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. చక్కెర పాకంలో చనిపోయిన దోమలు, తయారీ కేంద్రాల్లో కుక్కల సంచారం, కుళ్లిన బంగాళాదుంపలు, బూజుపట్టిన అల్లం, గడువు ముగిసిన పదార్థాలు బయటపడ్డాయి. సోంపు తయారీ కేంద్రంలో రూ.5.41 లక్షల విలువైన 5,045 కిలోల అనుమానాస్పద ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల అనంతరం 9 తయారీ కేంద్రాల లైసెన్సులను సస్పెండ్‌ చేశారు. మరో నాలుగు కేంద్రాలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

● తాజాగా మంగళవారం వరంగల్‌ మండిబజార్‌లోని బిర్యానీ హోటళ్లు, ఫుడ్‌ పాయింట్లపై టాస్క్‌ఫోర్స్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఖుర్షీద్‌, జాఫ్రాన్‌, తయబ్‌ హోటళ్లతోపాటు కోహినూర్‌, గ్రీన్‌పార్క్‌ బిర్యానీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. బిర్యానీ, చికెన్‌ వంటకాల్లో నిషేధిత సింథటిక్‌ రంగులు, టేస్టింగ్‌ సాల్ట్‌, ఫ్రోజెన్‌ చికెన్‌ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వంటగదుల్లో బొద్దింకలు, సాలెగూళ్లు, అపరిశుభ్ర వాతావరణం కనిపించాయి. ఆహార తయారీ సిబ్బందికి వైద్య ధ్రువపత్రాలు, హెడ్‌క్యాప్స్‌, గ్లౌజులు లేకపోవడాన్ని గుర్తించారు. సుమారు రూ.23,468 విలువైన పదార్థాలను స్వాధీనం చేసుకొని, ఆహార నమూనాలను పరీక్షలకు పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement