ఐనవోలు: ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల సహకారంతో నిత్యాన్నదానం నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈఓ కందుల సుధాకర్ తెలిపారు. ప్రస్తుతం ప్రతీ ఆదివారం మల్లన్న ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దర్శనం క్యూలో 150 టోకెన్లు ఇచ్చి అన్నప్రసాదం అందజేస్తున్నట్లు తెలిపారు. రానున్న జాతర రోజు ల్లో ఆది, బుధవారం అన్నదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల భక్తులు అన్నదానానికి విరాళాలు అందించడానికి ఈఓ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.


