కొలువుల కోసం కోటి ఆశలతో.. | - | Sakshi
Sakshi News home page

కొలువుల కోసం కోటి ఆశలతో..

Nov 2 2026 1:05 AM | Updated on Nov 2 2026 1:05 AM

కాశిబుగ్గ: వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి (ఎంజీఎం)లో ఔట్‌సోర్సింగ్‌ కొలువుల కోసం నిరుద్యోగులు కోటి ఆశలు పెట్టుకున్నారు. 24 అంతస్తు ల ఈ ఆస్పత్రిలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆస్పత్రి ప్రారంభం కాకముందే ఒక పక్క పైరవీలు, మరో పక్క ఉన్నతాధికారులపై ఒత్తిడి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా సర్కారు నుంచి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలకు జీఓ వచ్చిదని కూడా ప్రచారం జరుగుతోంది. వరంగల్‌ ఎంజీఎం స్థానంలో రూ.1,371 కోట్ల వ్యయంతో 2018 పడకలతో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతున్న విషయం విదితమే. తొలుత ఓపీ వైద్య సేవలు ప్రారంభిస్తామని ప్రకటించినా అమలు కాలేదు. అయినా ఎంజీఎంలో ఉన్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. దీనికి తోడు జిల్లా ఉన్నతాధికారులు నిర్మాణ పనులను కూడా యుద్ధప్రాతిపదికన చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి ప్రారంభం కాకముందే ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకం చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

జీఓ వచ్చిందని పుకార్లు..

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి జీఓ జారీ చేశారని పుకార్లు వినిపిస్తున్నారు. ఓ ఉన్నతాధికారి జీఓ ఇప్పుడే బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో కాకపోవడంతో తలలు పట్టుకున్న అధికారులు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకంపై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ ప్రకటించాల్సి ఉండగా.. కార్యరూపం దాల్చలేదు.

నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూపులు..

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామక నోటిఫికేషన్‌ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. కొత్త ఆ స్పత్రిలో కొలువుల కోసం ఎన్నో ఆశలతో ఉన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం ఎలాంటి నోటిఫికేషన్‌ రాకముందే పైరవీల జోరు కొనసాగుతోంది. ఆస్పత్రి లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది, ఇతరులతో కలిసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు దళారులు సైతం ఉద్యోగాల పేరిట దందాకు తెర లేపినట్లు సమాచారం. మరోపక్క ఇప్పటికే ఏజెన్సీలు నిర్వాహకులు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

చురుకుగా సాగుతున్న ఆర్చ్‌ నిర్మాణం

వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఎదుట చేపడుతున్న ఆర్చ్‌ నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. సకాలంలో ఆర్చ్‌ నిర్మించకపోవ డం కూడా ఓపీ సేవల ప్రారంభ జాప్యానికి కారణమనే ఆరోపణలు కూడా వచ్చాయి.

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో

ఉద్యోగాల కోసం నిరీక్షణ

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీ జీఓ వచ్చిందంటూ ప్రచారం

సర్కారు నోటిఫికేషన్‌ కోసం

నిరుద్యోగుల ఎదురుచూపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement