ప్రత్యామ్నాయమే శరణ్యం | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయమే శరణ్యం

Nov 2 2026 1:05 AM | Updated on Nov 2 2026 1:05 AM

ఖిలా వరంగల్‌: వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతం. ఎల్‌నినో ప్రభావంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఖరీఫ్‌లో వేసిన పంటల్ని కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఖేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్లతో కలిసి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఖేత్‌ బచావో అభియాన్‌ను ప్రారంభించారు. అవగాహన కార్యక్రమంపై ఉన్నతాధికారులు దిశా నిర్ధేశం చేశారు. దీంతో ఈనెల 30 వరకు అధికారులు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఖేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు.

క్లస్టర్‌ వారీగా సమావేశాలు

జిల్లాలో వానాకాలం 2,75,500 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలను సాగు చేశారు. 59 క్లస్టర్‌గా.. 214 రెవెన్యూ గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో భూ గర్భ జల మట్టాలు పడిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలన్న అంశంపై జిల్లాలో క్లస్టర్ల వారీగా అన్ని గ్రామ పంచాయతీల్లో సమావేశాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ, తక్కువ నీటితో పండే పంటలపై అవగాహన పెంచుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారు చేసి సదస్సులు చేపడుతోంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా ఖేత్‌ బచావో అభియాన్‌లో భాగంగా ముమ్మరంగా సదస్సులు నిర్వహిస్తున్నారు.

‘ఖేత్‌ బచావో అభియాన్‌’కు వ్యవసాయ శాఖ శ్రీకారం

నీటి సంరక్షణ, భూసార పరిరక్షణే లక్ష్యం

తక్కువ నీటితో పండే పంటలపై

రైతులకు అవగాహన

వ్యవసాయశాఖ అధికారులు,

శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో సదస్సులు

వానాకాలంలో పంటల సాగు విస్తీర్ణం 2,75,500 ఎకరాలు

జిల్లాలో 59 క్లస్టర్లు, 214 రెవెన్యూ గ్రామాలు

ఖేత్‌ బచావో అభియాన్‌ లక్ష్యం..

సేంద్రియ, జీవ ఉత్పత్తుల వినియోగం, ప్రకృతి సేద్యంపై అవగాహన

అభ్యుదయ రైతుల క్షేత్రాల సందర్శన

నీటి సంరక్షణ, భూగర్భజలాల పునరుద్ధరణ

ఫర్‌ డ్రాప్‌ మోర్‌క్రాప్‌ కార్యక్రమంపై అవగాహన

భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు, ఇతర వ్యవసాయ ఉత్పాదకాల సమతుల్య వినియోగం

నూనె గింజలు, పప్పు ధాన్యాలు, ఉద్యాన పంటల సాగుకు పోత్సాహం

సమగ్ర పోషకాల యజమాన్యం, సస్యరక్షణ, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం

వరికోతల అనంతరం ఖాళీగా ఉండే భూము ల సమర్ధవినియోగం, పంట అవశేషాల నిర్వహణ

భూసార కార్డుల వినియోగం, ఎరువుల విక్రయాలకు సంబంధించిన నిబంధనలు వివరించడం

రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు పై దృష్టి సారించాలని చెబుతున్నాం. ఖేత్‌ బచావో అభియాన్‌ ద్వారా క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించి, నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ, తక్కువ నీటితో పండే పంటలపై అవగాహన కల్పిస్తాస్తున్నాం. రైతులు.. వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటిస్తూ లాభదాయకమైన పంటలను సాగు చేయాలి.

– విజయభాస్కర్‌, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement