కాశిబుగ్గ: ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన ఓట్ బచావో– దేశ్ బచావోశ్రీ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ అయూబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల హక్కులకు భద్రత కల్పించాలన్నారు. ఓటు హక్కు కేవలం ఒక హక్కు మాత్రమే కాదని, ప్రజాస్వామ్య వ్యసస్థకు ఇది ప్రాణాధారమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ప్రక్రియల్లో ప్రతీ ఓటరుకు సమాన ప్రాధాన్యత ఉండాలని, ప్రజలు స్వే చ్ఛగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఓటు హక్కు ను వినియోగించుకునే పరిస్థితులు ఉండాలని తెలిపారు. కాగా జిల్లా నుంచి పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నేటి నుంచి హనుమకొండలో చేనేత వస్త్ర ప్రదర్శన
కాశిబుగ్గ: డెవలప్‌మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ న్యూడిల్లీ సహకారంతో చేనేత, జౌళిశాఖ తెలంగాణ సమన్వయంతో ఈ నెల 2 నుంచి 15 వరకు రాష్ట్ర చేనేత వరస్త్‌ర ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చేనేత జౌళి శాఖ వరంగల్ జిల్లా సహాయ సంచాలకుడు శ్రీకాంత్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ ఎన్జీవోస్ కాలనీ రోడ్డులోని రెడ్డి మ్యారేజ్ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ వస్త్ర ప్రదర్శనలో నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరలకు లభిస్తాయని తెలిపారు. పోచంపల్లి, గద్వాల, వెంకటగిరి, ఉప్పాడ, మంగళగిరి, ధర్మవరం చీరెలు, డ్రస్ మెటీరియల్స్, వరంగల్, కరీంనగర్ బెడ్‌షీట్లు, కార్పెట్లు, లుంగీలు, టవల్స్, ఇతర అన్ని రకాల చేనేత వస్త్రాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ చేనేత వస్త్ర ప్రదర్శనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, జమ్మూ, కాశ్మీర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి 60 ప్రాథమిక చేనేత సహకార సంఘాలు పాల్గొంటాయని తెలిపారు. ప్రజలు చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించి, అవసరమైనవాటిని కొనుగోలు చేసి, చేనేత కార్మికుల ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు.
నేడు ప్రజావాణి
న్యూశాయంపేట: ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన ప్రజా వాణిని వినియోగించుకోవాలని కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జిల్లా స్థాయిలో కలెక్టరేట్, రెవె న్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లో ఆర్డీఓ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సకాలంలో ప్రజావాణికి హాజరై ప్రజల సమస్యలు విని అర్జీలను స్వీకరించాలని కలెక్టర్ సూచించారు.
మార్కెట్ గుమస్తా సంఘం కార్యవర్గ విస్తరణ
ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ గుమస్తా సంఘం అధ్యక్షుడు సుంచు జగదీశ్వర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో కార్యవర్గాన్ని విస్తరించారు. పూర్థిసాయి కార్యవర్గాన్ని ఆధ్యక్షుడు సుంచు జగదీశ్వర్ ప్రకటించారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇనుముల అరుణ్, ప్రధాన కార్యదర్శిగా వంగరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా బండి చందర్, తొగరు రమేశ్, ఆకుల కృష్ణ, సహాయ కార్యదర్శులుగా సింగిరెడ్డి రమేశ్, బొల్లం సాయికుమార్, కొంతం నాగరాజు, కోశాధికారిగా గోరంట్ల శ్రవణ్, ఆర్గనైజర్లుగా షాబోత్ పృథ్వీ, మురాల ప్రశాంత్, రాజేశ్వర్‌రావు, రాకేశ్, శ్రీనివాస్, రాజశేఖర్, రమేశ్, అయిలయ్య, సాంబమూర్తి, భాస్కర్, బాజీ రవీందర్, వేణు నియమితులయ్యారు.
నామినేషన్ల స్వీకరణ
కాశిబుగ్గ: తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ (టీజీ జీడీఏ) కేఎంసీ యూనిట్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ అంబి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జనరల్ బదిలీలు, పదోన్నతుల వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తి కలిగి, అర్హత ఉన్న సభ్యుల నుంచి ఈ నెల 2న ఎంజీఎం క్యాంటీన్‌లో నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. అదేరోజు ఎన్నికై న సభ్యుల వివరాలను ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. అసోసియేషన్‌లో ఇద్దరు జనరల్ కౌన్సిల్ సభ్యులు, మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నాయని ఆయన వివరించారు. ఆసక్తిగల సభ్యులు నిర్ణీత తేదీన తమ నామినేషన్లను సమర్పించాలని కోరారు.


