ఆరుతడి పంటలు మేలు | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలు మేలు

Nov 1 2026 12:56 AM | Updated on Nov 1 2026 12:56 AM

● ఆత్మ పీడీ విజయ నిర్మల

ఖిలా వరంగల్‌: యాసంగిలో నీటి లభ్యతను బట్టి తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య, ఆత్మ పీడీ విజయనిర్మల, జాతీయ ఆహార భద్రత మిషన్‌ కన్సల్టెంట్‌ సారంగం, జిల్లా ఉద్యానవన అధికారి శ్రీనివాసరావు సూచించారు. వరంగల్‌ మండలం కొత్తపేట గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారి రవీందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఖేత్‌ బచావో అభియాన్‌పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా వారు హాజరై మాట్లాడారు. పెసర, మినుమ, శనగ, వేరు శనగ, నువ్వులు వంటి పంటలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. భూసార పరిరక్షణకు సేంద్రియ ఎరువులు వినియోగించాలని, వర్షపు నీటిని ఒడిసి పట్టి నేలలో తేమను కాపాడుకోవాలన్నారు. తక్కువ నీటితో కూరగాయలు, ఆరుతడి పంటల సాగు చేయాలని, భూసార ఆరోగ్య కార్డుల ఆధారంగా సమతుల్య ఎరువులు వాడాలన్నారు. అలాగే రైతులు తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నప్పుడే ప్రభుత్వ సబ్సిడీలకు అర్హులవుతారన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహమూర్తి, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, విద్యుత్‌ శాఖ అధికారి మానస, వ్యవసాయ సంచాలకులు నర్సింగం, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇట్యాల హరికృష్ణ, ఇన్‌స్పెక్టర్‌ జవ్వాజీ సురేష్‌, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement