రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందించాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందించాలి

Nov 1 2026 12:56 AM | Updated on Nov 1 2026 12:56 AM

● ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో

ఏటూరునాగారం:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రహత్‌ పథకా న్ని పూర్తిస్థాయిలో అమలు చేయా లని, రోడ్డు ప్రమాద బాధితులకు వెంటనే ఉచిత వైద్యసేవలు అందించాలని ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో వివిధ జిల్లాలకు చెందిన అధికారులను ఆదేశించారు. హనుకొండలోని ఐటీడీఏ పీఓ క్యాంపు కార్యాలయంలో శనివారం వరంగల్‌, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆస్పత్రుల ఎంపానెల్‌మెంట్‌, స్పెషలిస్ట్‌ వైద్యుల అవసరాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పథకం కింద ఆస్పత్రుల ఎంపానెల్‌మెంట్‌, ఆస్పత్రుల్లో అవసరమైన మానవ వనరులు, ముఖ్యంగా స్పెషలిస్ట్‌ వైద్యుల నియామక అవసరాలపై చర్చించారు. అదేవిధంగా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, ప్రస్తుతం పనిచేస్తున్న వైద్య సిబ్బంది, ఖాళీలు, ప్రత్యేక వైద్య నిపుణుల అవసరాలను సమగ్రంగా పరిశీలించి ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. ముఖ్యంగా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు విభాగాల వారీగా అవసరమైన మానవ వనరుల వివరాలను అందించాలని సూచించారు. సమావేశంలో వరంగల్‌, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement