పరకాల: వేములవాడ తరహాలో పరకాల కుంకుమేశ్వరాలయ రూపురేఖలు మారుస్తున్నట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని కుంకుమేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను సోమవారం ఆయన శైవాగమోక్తంగా భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. దేవాలయ అభివృద్ధికి మంజూరైన రూ.5 కోట్ల నిధులతో నాలుగు మహారాజ గోపురాలు, ప్రాకార మండపం, మాడవీధులు నిర్మాణం జరుగనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దేవస్థాన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్, దేవస్థాన చైర్మన్ కొలుగూరి రాజేశ్వర్‌రావు, పరకాల ఏసీపీ సతీశ్‌బాబు, ఆలయ ఏఓ నాగేశ్వర్‌రావు, ఆలయ ధర్మకర్తలు డాక్టర్ రంగు సరోజన, తోట రవి, గోవిందు సత్యనారాయణ, ప్రజాపత్ సవాల్ రామ్, గౌరిశెట్టి నవీన్, ఆలయ వంశానుగత అర్చకుడు కోమాళ్లపల్లి నాగభూషణం శర్మ, బ్రహ్మశ్రీ సంపత్‌కుమార్ శర్మతో పాటు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం


