కిలోమీటర్‌ మేర పైప్‌లైన్‌.. | - | Sakshi
Sakshi News home page

కిలోమీటర్‌ మేర పైప్‌లైన్‌..

Oct 27 2026 1:08 AM | Updated on Oct 27 2026 1:08 AM

కిలోమీటర్‌ మేర పైప్‌లైన్‌..

ఎల్‌నినో కారణంగా ఏర్పడ్డ తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పంట చేతికొచ్చే దశలో సాగు నీరందక కళ్లముందే ఎండిపోవడాన్ని చూసి తట్టుకోలేక రైతులు చివరికి కిలోమీటర్‌ మేర పైప్‌లైన్‌ వేసి నీరు పారిస్తున్నారు. కమలాపూర్‌కు చెందిన కొండమీది భిక్షపతి, సీతయ్య, రవి అన్నదమ్ములు. తమకున్న నాలుగున్నర ఎకరాలకు తోడు మరో ఆరున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని వర్షాలు, వ్యవసాయ బావిపై ఆధారపడి వరి సాగు చేశారు. ఎకరానికి సుమారు రూ.35 వేల చొప్పున మొత్తం రూ.3.85 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఎల్‌నినో కారణంగా సరైన వర్షాలు పడక, భూగర్భ జలాలు అడుగంటిపోయి బావిలో నీరు సరిపోవడంలేదు. ఎలాగైనా చేనును కాపాడుకోవాలని నిర్ణయించుకుని రూ.80 వేలు వెచ్చించి స్థానిక పెద్ద చెరువులో నీళ్లున్న ఓ గుంత నుంచి సుమారు కిలోమీటర్‌ దూరం వరకు పైప్‌లైన్‌ (140 లెన్త్‌) వేశారు. 5 హెచ్‌పీ మోటారు అమర్చి సాగు నీళ్లు పారించుకుంటూ పంటను కాపాడుకుంటున్నారు. ఈ ఏడాది.. పెట్టిన పెట్టుబడులు వస్తే చాలని, ఇప్పటికీ పంట సాగు ఖర్చు తడిసిమోపెడయ్యిందని రైతులు అంటున్నారు. – కమలాపూర్‌

పంటను కాపాడుకునేందుకు

రైతుల భగీరథ ప్రయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement