ఐనవోలు: వర్ధన్నపేట నియోజకవర్గంలో స్టేట్ స్పెషల్ ఫండ్ ద్వారా మంజూరైన రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని కొండపర్తి గ్రామానికి చెందిన మహాజన సోషలిస్ట్ పార్టీ (ఎంఎస్ఎఫ్) రాష్ట్ర నాయకుడు బొక్కల నారాయణ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్కి వినతిపత్రం అందించారు. మాజీ సర్పంచ్లు రాజమణి బెన్షన్, సదానందం, ఏలియా, బీఆర్ఎస్ మండల నాయకుడు వేణు, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు తరుణ్, రమేశ్, చంద్రమౌళి, వెంకన్న, ప్రవీణ్, రమేశ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.


