రోడ్డు ప్రమాద బాధితులకు ‘పీఎం రహత్‌’ | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాద బాధితులకు ‘పీఎం రహత్‌’

Oct 26 2026 2:10 AM | Updated on Oct 26 2026 2:10 AM

హసన్‌పర్తి: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రహత్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత సూచించారు. ఈ పథకం ద్వారా నిబంధనలకు అనుగుణంగా గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఏడురోజుల పాటు నగదు రహిత వైద్యసేవలు పొందవచ్చని పేర్కొన్నారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని 63 ఎంప్యానెల్డ్‌ ఆస్పత్రుల్లో పీఎం రహత్‌ పథకం కింద వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా అత్యవసర సేవలు అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు.

ప్రమాదం జరిగితే వెంటనే 112కు కాల్‌ చేయాలి

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సహాయం కోసం 112 నంబర్‌కు ఫోన్‌ కాల్‌ చేయాలని సీపీ సూచించారు. క్షతగాత్రులను వీలైనంత త్వరగా సమీపంలోని ఎంప్యానెల్డ్‌ ఆస్పత్రికి తరలించేలా సహకరించాలని కోరారు. పథకం కింద వైద్య సేవలు పొందేందుకు ఆస్పత్రి సిబ్బందిని సంప్రదించి అవసరమైన వివరాలు అందించాలని పేర్కొన్నారు.

క్షతగాత్రులకు సాయం చేయండి

రోడ్డు ప్రమాదానికి గురైన వారికి సాయం చేసే విషయంలో ప్రజలు మానవతా దృక్పథంలో వ్యవహరించాలని కోరారు. పోలీసులు, వైద్య సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చన్నారు. పీఎం రహత్‌ పథకంపై ప్రజలు అవగాహన పెంచుకుని, బాఽధితులకు ఈ పథకం ప్రయోజనాలు అందేలా సహకరించాలని సీపీ శ్వేత కోరారు.

రూ.1.50 లక్షల వరకునగదు రహిత వైద్యం

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement