రైతులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

రైతులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం

Oct 26 2026 2:10 AM | Updated on Oct 26 2026 2:10 AM

హన్మకొండ చౌరస్తా: ఎల్‌నినో ప్రభావంపై బీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని, కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు భరోసా ఇచ్చారు. హనుమకొండలోని కాంగ్రెస్‌ భవన్‌లో హనుమకొండ, వరంగల్‌ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డి, మహ్మద్‌ అయూబ్‌, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌తో కలిసి ఎమ్మెల్యే నాగరాజు ఆదివారం మీడియాతో మాట్లాడారు. రైతులకు సాగునీరు, ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన బీఆర్‌ఎస్‌ నేతలు.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును తమ ఘనతగా ప్రచారం చేసుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులు.. ఇప్పుడు అదే ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు తమ పదేళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే నాగరాజు హితువు పలికారు.

కాళేశ్వరం వెళ్లి నీతులు చెప్పడం కాదు.. ప్రజలకు వాస్తవాలు వివరించాలి

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement