మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్
హన్మకొండ: ఆడబిడ్డల ఆత్మగౌరవానికి కల్యాణలక్ష్మి కొండత భరోసా అని మాజీ ప్రభుత్వ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి పథకం అమలు ప్రారంభమై 12 ఏళ్లు అవుతున్న సందర్భంగా పథకాన్ని ప్రవేశపెట్టిన మాజీ సీఎం కేసీఆర్ కటౌట్‌కు బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, నాయకులతో కలిసి కేసీఆర్ కటౌట్‌కు క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా వంటి అనేక సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో మార్పులు తెచ్చాయన్నారు. ఆడబిడ్డల సంక్షేమానికి సంబంధించిన పథకాలను ప్రభుత్వం నీరుగార్చడం సరికాదన్నారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్లు, మాజీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


