జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ పబ్లిక్ గార్డెన్, వరంగల్ రైల్వేస్టేషన్ రోడ్డులోని బాపూజీ కమ్యూనిటీ హాల్‌లో గాంధీ విగ్రహాలకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, కొండా సురేఖ, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, చాహత్ బాజ్‌పాయ్, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్ పాల్గొన్నారు. – హన్మకొండచౌరస్తా/వరంగల్ చౌరస్తా


