మహాత్ముడి ఆశయాలు కొనసాగించాలి : సీపీ | - | Sakshi
Sakshi News home page

మహాత్ముడి ఆశయాలు కొనసాగించాలి : సీపీ

Oct 3 2026 1:38 AM | Updated on Oct 3 2026 1:38 AM

మహాత్ముడి ఆశయాలు కొనసాగించాలి : సీపీ దరఖాస్తుల ఆహ్వానం ఎయిర్‌పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి కోటను సందర్శించిన విదేశీ జర్నలిస్టులు

హసన్‌పర్తి: జాతిపిత మహాత్మాగాంఽఽధీ ఆశయాలు కొనసాగించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం వరంగల్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత, అడిషనల్‌ డీసీపీ రాయల ప్రభాకర్‌రావు, పోలీస్‌ అధికారులు ఉన్నారు.

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌లో పీహెచ్‌డీ, విశ్వేశ్వరయ్య పీడీఎఫ్‌ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శుక్రవారం నిట్‌ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. పీహెచ్‌డీకి బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకామ్‌, బ్యాచ్‌లర్స్‌ డిగ్రీ, ఎంబీఏ విద్యార్థులు అర్హులుగా పేర్కొంది. ఫుల్‌టైం, పార్ట్‌టైమ్‌, ఎగ్జిక్యూటివ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రాంకుగాను ఈనెల 14 వరకు దరఖాస్తుకు చివరి తేదీగా తెలిపింది. విశ్వేశ్వరయ్య పీడీఎఫ్‌కు పీహెచ్‌డీ డిగ్రీ లేదా పీహెచ్‌డీ థీసిస్‌ విద్యార్థులు అర్హులుగా, ఈనెల 12వ తేదీ దరఖాస్తుకు చివరి తేదీగా నిట్‌ యాజమాన్యం నిర్ణయించింది. admissions.nitc.ac.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

నయీంనగర్‌: వరంగల్‌ మామునూరు ఎయిర్‌పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని తెలంగాణ ఇంటెలెక్చువల్‌ ఫోరం డిమాండ్‌ చేసింది. శుక్రవారం ఫోరం ఆధ్వర్యంలో హనుమకొండ గ్రేటర్‌ వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో దొడ్డి కొమురయ్య తుపాకీ గుళ్లకు ఎదురుగా నిలిచి అమరత్వం పొందారని గుర్తుచేశారు. వరంగల్‌ మామునూరు ఎయిర్‌పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరును పెట్టడం అమరవీరులకు మనం ఇచ్చే నివాళిగా ఫోరం భావిస్తోందన్నారు. భూస్వాములు, రజాకార్లు, దేశ్‌ముఖ్‌లు, రాజరిక చరిత్ర పేర్లు తెలంగాణ ప్రాంతంలో కొనసాగడానికి వీల్లేదన్నారు. సమావేశంలో ఆజాద్‌, రాంబాబు, ఐలయ్య, మహేశ్‌, తిరుపతి, లింగయ్య, రాజేందర్‌, ప్రసాద్‌, రమేశ్‌, ప్రభాకర్‌, విద్యార్థి యువజన ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఖిలా వరంగల్‌: హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న వివిధ దేశాల జర్నలిస్టులు ఖిలా వరంగల్‌ కోటను శుక్రవారం సందర్శించారు. శిల్పకళా సంపద, ఖుష్‌మాహల్‌, ఏకశిలగుట్ట అందాలు తిలకించారు. కో ట విశిష్టతను అసిస్టెంట్‌ టూరిజం ప్రమోషన్‌ ఆఫీసర్‌ కుసుమ సూర్యకిరణ్‌ వారికి వివరించారు. ఇన్‌స్టిట్యూట్‌ ఇన్‌చార్జ్‌లు ఫయాజ్‌గౌతం, సాయి, కేంద్ర పురావస్తుశాఖ కో–ఆర్డినేటర్‌ శ్రీకాంత్‌, టీజీ టీడీసీ ఇన్‌చార్జ్‌ అజయ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement