నడికూడ: హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూరులో గురువారం జ్వరంతో గర్భిణి మృతి చెందింది. ఈ ఘటనపై ‘సాక్షి’లో శుక్రవారం కథనం ప్రచురితమవడంతో డీహెచ్‌ఎంఓ అప్పయ్య ఆదేశాల మేరకు రాయపర్తి ఏరియా మెడికల్ ఆఫీసర్ మాధవి, వైద్య సిబ్బంది శనివారం మృతురాలి ఇంటికి చేరుకొని కుటుంబీకుల నుంచి సమాచారం సేకరించారు. అనంతరం గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించి జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి చికిత్స అందించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు, ఆశలు, తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
సాక్షి...కథనానికి స్పందన


