శనివారం శ్రీ 3 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 3 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Oct 3 2026 1:38 AM | Updated on Oct 3 2026 1:38 AM

●

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

సికింద్రాబాద్‌–న్యూఢిల్లీ మధ్య ఉత్తర తెలంగాణను దేశ రాజధానితో అనుసంధానిస్తూ ఐదు దశాబ్దాలుగా పరుగులు తీస్తున్న తెలంగాణ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12723/12724) 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనుంది. 1976, అక్టోబర్‌ 3న అప్పటి ఆంధ్రప్రదేశ్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌గా ప్రారంభమైన ఈ రైలు.. రాష్ట్ర విభజన అనంతరం పేరు మార్పు చేసుకుని నేటి(2026, అక్టోబర్‌ 3)తో ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకుంటోంది. ఈ రైలుతో ఉమ్మడి వరంగల్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రారంభ సమయంలో కాజీపేట జంక్షన్‌లోనే హాల్ట్‌ ఉండేది. ఇక్కడి ప్రయాణికులు ఢిల్లీ, ఉత్తర భారత ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు ఇది కీలక రవాణా మార్గమైంది.

వారానికి రెండు రోజులతో మొదలు..

1976లో రైలు ప్రారంభించినప్పుడు వారానికి రెండు రోజులు మాత్రమే నడిచేది. అది కూడా 14 బోగీలతో సేవలందించేది. ప్రయాణికుల ఆదరణ, డిమాండ్‌ పెరగడంతో వారానికి మూడు రోజులకు సర్వీసులను పెంచారు. అనంతరం 1991లో నిత్యసేవగా మార్చడంతో పాటు బోగీల సంఖ్యను 24కు పెంచారు. ప్రస్తుతం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తుండగా.. రైలులో 22 కోచ్‌లు ఉంటున్నాయి. రైలు ప్రారంభించిన తొలినాళ్లలో కాజీపేట జంక్షన్‌లో మాత్రమే స్టాప్‌ సదుపాయం ఉండేది. దీంతో వరంగల్‌, హనుమకొండతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాల నుంచి ఢిల్లీ వెళ్లే ప్రయాణికులకు కాజీపేట కీలక బోర్డింగ్‌ పాయింట్‌గా మారింది. తర్వాత ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లిలోనూ హాల్ట్‌ సదుపాయం కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement