‘ఎఫ్‌ఎల్‌ఎన్‌’లో దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

‘ఎఫ్‌ఎల్‌ఎన్‌’లో దరఖాస్తుల ఆహ్వానం

Sep 19 2026 8:50 AM | Updated on Sep 19 2026 8:50 AM

కాళోజీ సెంటర్‌: ఎఫ్‌ఎల్‌ఎన్‌ (ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ) సెల్‌లో ఖాళీగా ఉన్న ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం ఒకటి, ఎస్‌జీటీ మూడు పోస్టులకు అర్హత, ఆసక్తి కలిగిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ బి.రంగయ్య నాయుడు తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 22వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ప్రతి పోస్టుకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి, కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, డీఈఓ తదితరులతో కూడిన కమిటీ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారని వివరించారు. ఎల్‌ఎఫ్‌ఎల్‌ పోస్టుకు కనీసం రెండేళ్ల హెడ్‌మాస్టర్‌ అనుభవంతో పాటు మొత్తం 10 ఏళ్ల సర్వీసు ఉండాలని, క్లస్టర్‌, మండల, జిల్లా లేదా రాష్ట్రస్థాయిలో రిసోర్స్‌ పర్సన్‌/ట్రైనర్‌గా పనిచేసిన అనుభవం, నాయకత్వం, శిక్షణ నిర్వహణ సామర్థ్యాలు, ఎంఎస్‌ ఆఫీస్‌ పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ఉండాలని పేర్కొన్నారు. ఎస్‌జీటీ పోస్టులకు తెలుగు, ఇంగ్లిష్‌, గణిత విభాగాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారని, కనీసం ఐదేళ్ల బోధనా అనుభవం, రిసోర్స్‌ పర్సన్‌/ట్రైనర్‌గా అనుభవం, ఎఫ్‌ఎల్‌ఎన్‌ బోధనా విధానంపై అవగాహన, ఎంఎస్‌ ఆఫీసర్‌ ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలని, అభ్యర్థుల వయస్సు 56 సంవత్సరాలకు మించకూడదని తెలిపారు. ప్యానల్‌ ఇన్‌స్పెక్షన్‌ టీంలలో సభ్యులుగా ఉన్న ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు, ఎస్‌జీటీలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement