● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆర్థికాభివృద్ధికి దోహదపడే విలువైన సహజ వనరుగా వెదురు నిలుస్తుందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వెదురుతో తయారు చేసిన వస్తువులను అందజేశారు. అదనపు కలెక్టర్లు ఎల్.కిశోర్‌కుమార్, వైవీ గణేశ్, బీసీ సంక్షేమాధికారి పుష్పలత, జెడ్పీ సీఈఓ వసంత, పశుసంవర్థక శాఖ అధికారి బాలాజీ, అధికారులు పాల్గొన్నారు.
లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి
జాతీయ డిజిటల్ పశుసంపద మిషన్ (నేషనల్ డిజిటల్ లైవ్‌స్టాక్ మిషన్) లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధి కారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పథకాల అమలు, సాధించిన ప్రగతిని సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ వసంత, డీపీఓ కల్పన, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి టి.బాలాజీ, వ్యవసాయశాఖాధికారి విజయభాస్కర్, విజయ డెయిరీ డీడీ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
ప్రసూతి ఆస్పత్రి పరిశీలన
ఖిలా వరంగల్: ఉర్సు కరీమాబాద్‌లోని సీకేఎం ప్రభుత్వ అనుబంధ ప్రసూతి ఆస్పత్రిని శుక్రవారం కలెక్టర్ డాక్టర్ సత్యశారద సందర్శించారు. ఆపరేషన్ థియేటర్‌లో పరికరాలు ఎలా ఉన్నాయి, పరిసరాలు, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. అలాగే, కరీమాబాద్‌లోని డ్రగ్స్ స్టోర్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కె.లక్ష్మీదేవి, ఇన్‌చార్జ్ ఆర్‌ఎంఓ కె.సత్యజిత్‌రే, తహసీల్దార్ ఇక్బాల్ పాల్గొన్నారు.


