ఐలమ్మ పోరాటం నేటి తరానికి ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

ఐలమ్మ పోరాటం నేటి తరానికి ఆదర్శం

Sep 11 2026 12:02 PM | Updated on Sep 11 2026 12:02 PM

ఐలమ్మ పోరాటం నేటి తరానికి ఆదర్శం

కాజీపేట అర్బన్‌ : వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం నేటితరానికి ఆదర్శమని కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం న్యూశాయంపేట జంక్షన్‌లోని ఐలమ్మ విగ్రహానికి వరంగల్‌, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్‌ సత్యశారద, చాహత్‌ బాజ్‌పాయ్‌తో కలిసి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ.. ఐలమ్మ స్ఫూర్తితో సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత, సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తోందన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు ఎన్‌.రవి, వైవీ గణేశ్‌, ఎల్‌.కిషోర్‌కుమార్‌, హనుమకొండ తహసీల్దార్‌ రవీందర్‌రెడ్డి, బీసీ సంక్షేమాధికారి పుష్పలత, లక్ష్మణ్‌, మీసాల ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కుడా చైర్‌పర్సన్‌

గుండు

సుధారాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement