● ముల్కనూరు సొసైటీలో సదస్సు
● రైతులకు శాసీ్త్రయ పద్ధతులపై అవగాహన
భీమదేవరపల్లి: రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా శాసీ్త్రయ పద్ధతుల్లో పట్టు సాగు చేపడితే అధిక లాభాలు గడించవచ్చని వ్యవసాయ, పట్టుపరిశ్రమ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు సూచించారు. ‘మేరా రేషం – మేరా అభిమాన్ 2.0’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పట్టు మండలి, రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం భీమదేవరపల్లి మండల కేంద్రంలోని ముల్కనూరు కో–ఆపరేటివ్ రూరల్ బ్యాంక్ అండ్ మార్కెటింగ్ సొసైటీ ఆవరణలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి మైసూరు సీఎస్‌బీ–సీఎస్‌ఆర్టీఐ శాస్త్రవేత్త డాక్టర్ వజ్రమ్మ, హనుమకొండ జిల్లా సెరికల్చర్ జాయింట్ డైరెక్టర్ అనసూయ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ప్రస్తుత వర్షాభావ, ఎల్‌నినో పరిస్థితుల్లో మల్బరీని శాసీ్త్రయంగా ఎలా సాగు చేయాలి? పట్టుపురుగుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై రైతులకు సమగ్రంగా వివరించారు. మల్బరీ సాగు చేస్తూ లాభాల బాటలో పయనిస్తున్న రైతులను సన్మానించారు. సుమారు 100 మంది రైతులు, మహిళలు పాల్గొన్న ఈసదస్సులో ములుగు ఆర్‌ఎస్‌ఆర్‌ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ తిరుపంరెడ్డి, హనుమకొండ డీహెచ్‌ఎస్‌ఓ కమలాకర్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ ప్రతినిధి శంకర్, మండల వ్యవసాయ అధికారి పద్మ, ఎంఆర్‌ఎంఏ జిల్లా నోడల్ అధికారి సంజీవరెడ్డి, వరంగల్ ఏడీ తిరుపతిరెడ్డి, సెరికల్చర్ అధికారి మల్లయ్య పాల్గొన్నారు.


