ఐనవోలు: ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో చదవడం, రాయడం, గణిత సంబంధ విషయాల్లో నైపుణ్యాలు పెంపొందించాలని డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని ఒంటిమామిడిపల్లి, పున్నేలు ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమ అమలులో భాగంగా ఆయా పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్ధుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఎంపీపీఎస్ పున్నేలు పాఠశాలలో ఇటీవల మంజూరైన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. పున్నేలు పాఠశాల నుంచి రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైన జడ మానస, పత్రి రాజేందర్, ఇరుముండ్ల హర్షవర్ధన్, ఫిజికల్ డైరెక్టర్ కిషన్‌ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా మానిటరింగ్ ఆఫీసర్ మన్మోహన్, ఎంఈఓ పులి ఆనందం, సర్పంచ్ షేక్ ఉస్మాన్ అలీ, యోగా అసోసియేషన్ అధ్యక్షుడు బాల్నె శ్రీధర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొలిశెట్టి కమలాకర్, రాము, నిహారిక, కిరణ్, వేణుమాధవ్, రజిత, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు వెంకటేశ్వర్లు, వసంతకుమార్, సదానందం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


