మన అంగన్‌వాడీ, మన బాధ్యత | - | Sakshi
Sakshi News home page

మన అంగన్‌వాడీ, మన బాధ్యత

Sep 11 2026 11:15 AM | Updated on Sep 11 2026 11:15 AM

నాణ్యమైన యూనిఫాం తయారు చేయాలి

గీసుకొండ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం పొదుపు సంఘాల మహిళలు యూనిఫాంలు డబుల్‌ స్టిచ్‌తో నాణ్యతగా ఉండాలని డీఆర్‌డీఓ నాగపద్మజ అన్నారు. మంగళవారం బొడ్డుచింతలపెల్లి పాఠశాలలో స్కూల్‌ యూనిఫాం తయారీని పరిశీలించారు. సకాలంలో దుస్తులను అందించే విధంగా పనుల్లో వేగం పెంచాలన్నారు. ఏఈఎం ఈశ్వర్‌, సీసీ సురేశ్‌, పంచాయతీ కార్యదర్శి ఆనంద్‌, ఏపీఓ చంద్రకాంత్‌, టీఏ సింగ్‌, వీవోఏలు సునీత, ప్రకాశ్‌, ఎఫ్‌ఏ లత, సుమలత, సోని, వసంత, సరిత, స్రవంతి, సుజిత పాల్గొన్నారు.

రేపటితో

ముగియనున్న గడువు

ఖిలా వరంగల్‌: సన్న రకాల వరి సాగు చేసిన రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు రేపటితో (గురువారం) గడువు ముగియనుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయభాస్కర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు సన్న రకాల వరి ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు అదనంగా క్వింటాకు రూ.500 బోనస్‌ అందించనుంది. ఈ మేరకు రైతులు సన్న రకాల సాగు వివరాలతో స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ)కు అందించాలన్నారు. ఏఈఓలు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారన్నారు.

మూడు జిల్లాల

మత్స్యకారులకు శిక్షణ

కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో మత్స్యకారులకు మూడు రోజుల పాటు ఇచ్చే శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు వరంగల్‌ జిల్లాకు చెందిన మత్స్యకారులు, మత్స్య రైతులు హాజరయ్యారు. తొలిరోజు బయోప్లాక్‌ విధానంలో చేపల పెంపకంపై ఖమ్మం జిల్లా మత్స్య సహకార సంఘాల చీఫ్‌ ప్రమోటర్‌ వెంకటేశ్వర్లు అవగాహన కల్పించారు. ఆతర్వాత పలు అంశాలపై పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ శ్యాంప్రసాద్‌తో పాటు శాస్త్రవేత్తలు రవీందర్‌, దివ్య సూచనలు చేశారు.

కాళోజీ సెంటర్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ‘పోషణ మాసం 2026’ కార్యక్రమం నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. నెలరోజుల పాటు ‘మన అంగనన్‌వాడీ – మన బాధ్యత’ అనే నినాదంతో జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో భాగంగా గర్భిణులు, బా లింతలు, చిన్నారుల పోషకాహార స్థితిని మెరుగుపరచడం, పోషకాహార లోపాన్ని అరికట్టడం, ప్రజల్లో పోషకాహారంపై అవగాహన పెంచడం పోషణ మాసం ప్రధాన లక్ష్యం. కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమం, పురపాలక, పాఠశాల విద్య, సెర్ఫ్‌, మెప్మా, క్రీడలు– యువజన సర్వీసుల శాఖలతో పాటు వివిధ భాగస్వామ్య సంస్థల సమన్వయంతో నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమాధికారి రాజమణి తెలిపారు.

నెలరోజుల పాటు విస్తృత కార్యక్రమాలు

పోషణ మాసం ప్రారంభోత్సవ కార్యక్రమం నేడు ఉదయం 11 గంటలకు జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. వారణాసి నుంచి నిర్వహించే కేంద్రస్థాయి కార్యక్రమం వెబ్‌కాస్ట్‌ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో వీక్షించనున్నారు. అలాగే నెలరోజుల పాటు పోషణ మేళాలు, వంటకాల ప్రదర్శనలు, గృహ సందర్శనలు, సంరక్షకుల భాగస్వామ్యంతో పోషణ సమావేశాలు నిర్వహించనున్నారు. అంగన్‌వాడీ నిర్వహణ కమిటీల (ఏఎంసీ) బలోపేతం, పోషణ చాంపియన్ల సత్కారం, ఈసీసీఈ దినోత్సవం, ప్రధాన మంత్రి మాత వందన యోజన (పీఎంఎంవీవై)పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఆహార వైవిధ్యం, ప్రోటీన్‌ యుక్త పోషణ

అంగన్‌వాడీ కేంద్రాల్లో తాజా, వేడి భోజనం

సామాజిక భాగస్వామ్యం

ప్రారంభ బాల్య వ్యవస్థ సంరక్షణ, విద్య, వికాసం

ప్రీఎంఎంవీవై సురక్షిత మాతృత్వం

ప్రధాన థీమ్‌లు ఇవే

నేటి నుంచి పోషణ మాసం

నెలరోజుల పాటు విస్తృత కార్యక్రమాలు

జిల్లా సంక్షేమాధికారి రాజమణి

జిల్ల్లాలో 919 అంగన్‌వాడీ కేంద్రాలు

విజయవంతం చేయాలి

నెల రోజుల పాటు నిర్వహించే పోషణ మాసాన్ని విజయవంతం చేయాలి. తల్లిదండ్రులు, స్వయం సహాయక సంఘాలు, ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థలు తమవంతు సహకారం అందించాలి. సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలు చురుకుగా పాల్గొనాలి.

– రాజమణి, జిల్లా సంక్షేమాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement