డిజిటల్‌ క్రాప్‌ సర్వేతో పారదర్శకత | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ క్రాప్‌ సర్వేతో పారదర్శకత

Sep 11 2026 11:15 AM | Updated on Sep 11 2026 11:15 AM

సంగెం: డిజిటల్‌ క్రాప్‌ సర్వేతో రైతులు సాగు చేస్తున్న పంటల సాగు విస్తీర్ణం, పంటల రకాలను పారదర్శకంగా నమోదు అవుతాయని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని తిమ్మాపూర్‌లో జరుగుతున్న డిజిటల్‌ క్రాప్‌ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జియో ట్యాగింగ్‌తో రైతులు ఏఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో ఖచ్చితమైన వివరాలు వస్తాయన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. గ్రామాల్లో ఇంటర్‌, డిగ్రీ విద్యను పూర్తి చేసి వ్యవసాయంపై అవగాహనతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను సర్వే వలంటీర్లుగా ఎంపిక చేసి గ్రామాల వారీగా సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యసాయాధికారి బస్వపత్రి జగదీశ్వర్‌, ఉద్యానవన శాఖ అధికారి మానస, ఏఈఓ కార్తీక్‌, రాజేందర్‌, సర్వేయర్‌ రాజేందర్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement